03-07-2025 12:38:43 AM
హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్, సిటీ బ్యూరో జులై 2 (విజయక్రాంతి) : వర్షాకాలంలో ప్రజలకు ఎలాం టి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు 24 గంటలు అప్రమత్తంగా, అంకితభావంతో పనిచేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏ.వి. రంగనాథ్ స్పష్టం చేశారు. వర్షానికి ముందే పూర్తి సంసిద్ధతతో ఉండాలని ఆయన ఎంఈ టీలకు దిశానిర్దేశం చేశారు. బుధవారం హైడ్రా కార్యాలయంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ల కాంట్రాక్టర్లు, హైడ్రా మార్షల్స్, డీఆర్‌ఎఫ్ మేనేజర్లు, సూపర్వైజర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో హైడ్రా కమిషనర్ మాట్లాడారు.
జూలై 1వ తేదీ నుంచి రంగంలోకి దిగిన ఈ టీమ్లు వాతావరణ హెచ్చరికలను క్షుణ్ణం గా పరిశీలించి, తదనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించా రు. వర్షం పడితే తలెత్తే సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కమిషనర్ తెలిపారు. ఎక్కడ ఎలాంటి సమస్య వస్తుందో, దానికి తక్షణ పరిష్కారం ఏమిటో కూడా ముందే తెలుసుకోవాలన్నారు. వర్షం కురుస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండి, రహ దారులను, నివాసాలను వరద ముంచెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతేకా కుండా, వర్షం లేని సమయంలో సమస్యల శాశ్వత పరిష్కారంపై దృ ష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభు త్వం హైడ్రాపై నమ్మకంతో వర్షాకాలం పను ల బాధ్యతను అప్పగించింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది అని కమిషనర్ రంగనాథ్ గుర్తుచేశారు. ప్రజల విశ్వాసం చూరగొనేలా తమ పనితీరు ఉండాలని సూచించా రు. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు పరిధులు పెట్టుకుని కూర్చోకూడదు. పక్క సర్కి ల్లో సమస్య ఉన్నా, వెంటనే అంద రూ చేతులు కలిపి పరిష్కరించాలి అని కాం ట్రాక్టర్లకు స్పష్టం చేశారు.
జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైడ్రా, ఇరిగేషన్ వంటి సంబం ధిత శాఖలన్నిటితో అధికారులు సమన్వ యం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడమే లక్ష్యం కావాల న్నారు. వర్షాకాలంలో సాధారణంగా తలెత్తే వాహనాలు మొరాయించడం, నీటిని తోడే పంపులు పనిచేయకపోవడం వంటి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడా లని ఆదేశించారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే, వెంటనే సంబంధిత అధికారి దృష్టికి తీసుకువస్తే ఆ సమస్య పరిష్కారానికి చర్య లు తీసుకుంటామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాలు ఫిర్యాదు చేసినప్పుడు వాటి పరిష్కారానికి ఎంతో బాధ్యతతో వ్యవహరించాలని హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశించారు.