08-07-2025 01:53:10 PM
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad District) మంగళవారం మంత్రులు పర్యటిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ శంకు స్థాపనలు చేశారు. లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) మాట్లాడుతూ... మహబూబాబాద్ వంటి వెనుకబడిన జిల్లాలను కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు. సిరిసిల్ల, సిద్దిపేట గురించి తప్ప ఇతర జిల్లాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి మండిపడ్డారు. మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కోమటి రెడ్డి స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ లు కేటాయిస్తున్నామని కోమటి రెడ్డి పేర్కొన్నారు.