calender_icon.png 15 September, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవాపక్షం కార్యక్రమాలను నిర్వహించాలి

15-09-2025 12:06:51 AM

 బీజేపీ అబ్దుల్లాపూర్‌మెట్ మండల అధ్యక్షుడు సాయికిరణ్

అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 14: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీవరకు సేవాపక్షం కార్యక్రమాలను అబ్దుల్లాపూర్ మెట్ మండల వ్యాప్తంగా నిర్వహించాలని బీజేపీ అబ్దుల్లాపూర్‌మెట్ మండల అధ్యక్షులు బబ్బురు సాయికిరణ్  కోరారు. మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో ఆదివారం మండల స్థాయిలో కార్యశాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా హాజరైన సాయికిరణ్ మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్, రక్తదాన శిబిరం, పేదలకు, దివ్యాంగులకు, స్కూల్ పిల్లలకు, ఆపరేషన్ సింధూరి పైన చిత్రలేఖనం వంటి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత వడ్డేపల్లి పాపయ్య, మాజీ సర్పంచ్ వీరస్వామి, మేడిపల్లి వెంకటేశ్, ఉప్పు నవీన్, సీలోజు శ్రవణ్,  పెద్దింటి సుధాకర్, రామకృష్ణ, నిఖిలేష్ గుప్తా, గడ్డం వెంకటేష్, గోపగోని బాలయ్య గౌడ్ తదితరులున్నారు.