15-09-2025 12:08:44 AM
- హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలతో నలభై ఏండ్ల అనుబంధం
- సర్పంచి, ఎంపీపీ, సింగిల్ విండో చైర్మన్ గా నిస్వార్ధ సేవలు
- టీడీపీ నుంచి మొదలైన రాజకీయ జీవితం
- బీఆర్‌ఎస్‌లో రాష్ట్ర కార్యదర్శిగా గుర్తింపు
- నివాళులు అర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి హరీశ్ రావు
హుస్నాబాద్, సెప్టెంబర్ 14 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి చెంది న సీనియర్ రాజకీయ నాయకుడు, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి(80) ఆక స్మికంగా కన్నుమూశారు. నియోజకవర్గంలో ని కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఆయన ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, ప్రజలతోపాటు అన్ని పార్టీల నా యకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాస్వామ్య విలువలను ఆచరించి, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించిన కర్ర శ్రీహరి తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని పూర్తిగా ప్రజలకే అంకితం చేశారు. జిల్లా అధికారుల వద్ద ప్రజల సమస్యలను పరిష్కరించుకునే వరకు వారితో పా టు అక్కడే ఉండే నిబద్ధత ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. టీడీపీ నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం బీజేపీ, బీఆర్‌ఎస్ వరకు కొనసాగింది.
సర్పంచి, ఎంపీపీ, జడ్పీటీసీ, సింగిల్ విండో చైర్మన్ గా ప్రజలకు నిస్వార్ధ సేవలు అందించారు. ఆయన ఎంఎల్‌ఏ, ఎంపీ స్థాయికి చేరే సామర్థ్యం ఉన్నా, పలు కారణాల వల్ల పెద్ద స్థాయిలో ప్రాతిని థ్యం దక్కకపోవడం ఒక లోటని ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. ఆ యన మరణంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. కర్ర శ్రీహరి తన సుదీర్ఘ రా జకీయ జీవితంలో ప్రజల కోసం నిరంతరం పోరాడారు. ఆయన మృతి నియోజకవర్గానికి అపూర్వ నష్టమన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ కూ డా శ్రీహరి మృతదేహానికి పూలమాలలు వే సి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
కర్ర శ్రీహరి రాజకీయ ప్రయాణం...
1980ల చివరి శనిగరం గ్రామ సర్పంచ్ గ్రామాభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం 1990లలోఎంపీపీ (మండల పరి షత్ ప్రెసిడెంట్)కోహెడ మండల అభివృద్ధి ప్రణాళికలు, పల్లెల్లో మౌలిక సదుపాయాలు 2000లలోజడ్పీటీసీ సభ్యుడు జిల్లాస్థాయి అభివృద్ధి నిర్ణయాల్లో కీలక పాత్ర. 2010 లలో సింగిల్ విండో చైర్మన్ రైతుల సమస్యలు, మార్కెట్ మౌలిక వసతుల మెరుగుదల. 2020ల వరకుప్రజాసేవకుడిగా కొనసాగింపు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు, సమస్యల పరిష్కారంలో నిబద్ధత కలిగిన నాయకుడు కర్ర శ్రీహరి అంటూ చర్చించుకోవడం కనిపించింది.
ఒక ప్రజా ప్రతినిధి ఎన్ని పదవులు చేపడతాడనేది ముఖ్యమేమీ కాదు. ఆయన ఎంత నిబద్ధతతో, ఎంత నిజాయితీతో ప్రజ ల కోసం పనిచేశాడనేది చరిత్ర గుర్తుంచుకుంటుంది. నేటి నాయకులు, రాజకీయా ల్లోకి ప్రవేశిస్తున్న వారు కర్ర శ్రీహరి రాజకీయ తత్వాన్ని అవలంబిస్తే, ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం రాజకీయ విజయమే అనే ఆయన సూత్రం నేటికీ మార్గదర్శకంగా ఉంటుంది.