21 August, 2026 | 2:41 AM

శంషాబాద్, చెన్నై బుల్లెట్ రైలును పాత మార్గాన్నే కొనసాగించాలి

21-08-2026 12:00 AM

బీజేపీ నాయకులు

కోదాడ ఆగస్టు 20: శంషాబాద్ నుండి చెన్నై వరకు ప్రతిపాదించిన బుల్లెట్ రైలు మార్గాన్ని పాత ప్రతిపాదన ప్రకారమే కొనసాగించాలని, దారి మళ్లింపు ప్రయత్నాలను ఉపేక్షించేది లేదని బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి కనగాల నారాయణ స్పష్టం చేశారు. గురువారం కోదాడ పట్టణంలో ఆ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు నాయకులు కుంటిసాకులు చూ పుతూ రూట్ మార్చడానికి చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ విషయమై ఉద్యమాలు చేపడతామని, కోదాడ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం పాత మార్గాన్నే ఖరారు చేసేలా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు. బీజేపీ పిలుపునిచ్చే ఉద్యమ కార్యక్రమాలకు మేధావులు, విద్యావేత్తలు, వర్తకులు, మహిళలు, యువత మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి యరగాని కళావతి రాధాకృష్ణ , జిల్లా కార్యవర్గ సభ్యులు జల్లా జనార్ధన్ , భూమా శ్రీనివాస్, అనంతగిరి మండల అధ్యక్షులు చింతకుంట్ల సతీష్, చిలుకూరు మండల అధ్యక్షులు పారెల్లి మహేష్, నడిగూడెం అధ్యక్షులు బండారు వీరబాబు, మునగాల మాజీ మండల అధ్యక్షులు భద్రంరాజు కృష్ణ ప్రసాద్ , కోదాడ రూరల్ మాజీ మండల అధ్యక్షులు దేవరశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.