calender_icon.png 31 December, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూ ఇయర్ పేరుతో న్యూసెన్స్ చేయొద్దు

31-12-2025 12:00:00 AM

 సీఐ సత్యనారాయణ 

కేసముద్రం, డిసెంబర్ 30 (విజయక్రాంతి): న్యూ ఇయర్ వేడుకల పేరుతో పబ్లిక్ న్యూసెన్స్ చేయకూడదని, రోడ్లపైన ఆంగ్ల సంవత్సరాది వేడుకలు నిర్వహించకూడదని, డీజే ఏర్పాటుకు అనుమతి లేదని, తాగి రోడ్లపై తిరిగితే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కేసముద్రం సీఐ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసముద్రం సర్కిల్ పరిధిలోని కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో పరిధిలో బుధవారం రాత్రి ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు.

న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని, కొత్త సంవత్సరం పేరుతో యువకులు మద్యం సేవించి రోడ్లపై న్యూ సెన్స్ చేయడం గాని, రాష్ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని, అలాంటి పరిస్థితి రాకుండా ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించుకుని పోలీసులకు సహకరించాలన్నారు. కేసముద్రం పట్టణ పరిధిలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పై న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయకుండా ఫ్లై ఓవర్ ప్రాంతం పై రాత్రి 11 గంటల నుండి బారీ కేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేస్తామని చెప్పారు.