calender_icon.png 18 July, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరూ హ్యాపీ అయితేనే సినిమా సక్సెస్ అని భావిస్తా

28-08-2024 12:34:31 AM

హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్‌జే సూర్య పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కథానాయకుడు నాని మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. “ఎప్పుడైనా కంటెంటే సినిమాను చూసుకుంటుంది. రిలీజ్‌కు ముందు, తర్వాత పాజిటివిటీ అందరికీ రీచ్ చేయడం మన బాధ్యత.

సాధారణంగా నా సినిమాలన్నిటిలో తెలియని ఒక బరువును మోస్తుంటాను. అది ఈసారి సూర్య మీద, వివేక్ ఉంది. నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నా. పెర్ఫార్మెన్స్‌పరంగా ప్రియంక, మురళీశర్మ.. ఇలా అందరిపైనా భారం ఉంది. సినిమాలో అడ్రినలిన్ పంపింగ్ మూమెంట్స్ ఉంటాయి. కథ ప్రకారం ఆ అడ్రినలిన్ పంపింగ్ వందశాతానికి తీసుకెళ్లాం. జేక్స్ మొత్తం సినిమాను హీరో ఇంట్రో సాంగ్‌లా కంపోజ్ చేశాడు.

సినిమా రిలీజైన తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారని తెలిస్తేనే సక్సెస్ అని ఫీలవుతా. ఈ సినిమాకు ‘శనివారం’ పేరు పెట్టడానికి అదిరిపోయే ఎమోషనల్ రీజన్ ఉంది. నా ఫేవరెట్ మూమెంట్ అది. సినిమా స్టార్ట్ అయిన ఐదు నిమిషాలకు వస్తుంది. సోకులపాలెం కథకు ఎమోషన్‌ను యాడ్ చేస్తుంది. ప్రేక్షకులు ఆదరిస్తే ‘సరిపోదా శనివారం’ను ప్రాంచైజ్‌గా తీసుకువెళ్లవచ్చు” అని తెలిపారు.