03-01-2026 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్, జనవరి- 2: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ జరిగే పద్ధతి చాలా గందరగోళంగా ఉందని, స్పీకర్ మాట్లాడే పద్ధతి అస్సలు బాగాలేదని‘ముఖ్యమంత్రి విమర్శిస్తే ప్రతిపక్షా లకు మైకు ఇవ్వను‘ అని చెప్పటం రాజ్యాంగ విరుద్ధమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ప్రతిపక్షాలు అసెంబ్లీకి వచ్చేది ప్రజల పక్షాన పోరాడటానికి కానీ, ముఖ్యమంత్రిని పొగడటానికి కాదనే విషయాన్ని స్పీకర్ గుర్తుపెట్టుకోవాలన్నారు.
ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం అంటే ప్రజల గొంతు నొక్కటమే అన్నారు. మూసి కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపే ఎక్కువగా ఉందని,మూసి ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ తో ప్రక్షాళన చేయాలని విమర్శించారు. స్పీకర్ ఇప్పటికైనా అసెంబ్లీ రూల్స్ చదువుకొని, ప్రతిపక్షాలకు ఉన్నటువంటి హక్కులను కాలరాయకుండా మెలగాలన్నారు. స్పీకర్ అంటే ప్రతిపక్షాలకు అధికారపక్షాలకు సమానంగా అవకాశాలు ఇవ్వాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పక్షపాత ధోరణి వీడాలని తెలిపారు.