03-01-2026 12:00:00 AM
కందుకూరు, జనవరి 2 (విజయ క్రాంతి ): జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అపార్టీ రంగారెడ్డి, కామారెడ్డి,మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగా రెడ్డి,నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.శుక్రవారం ఎదురు గట్ల సంపత్ గౌడ్,రామిడి వెంకట్ రెడ్డిలతో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు,
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగా రెడ్డి, కామా రెడ్డి జిల్లా అధ్యక్షుడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నగరంలోని జాగృతి ప్రదాన కార్యాలయంలో వ్వవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కవితక్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చము అందజేశి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పాండురంగా రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు, సంస్థాగతంగా బలోపేతం గురించి క్లుప్తంగా వివరించారు. ఇతర జాగృతి నాయకులు బాబురావు, చీమల రమేశ్, చదలవాడ విష్ణుమూర్తి పాల్గొన్నారు.