calender_icon.png 27 November, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి

27-11-2025 12:43:47 AM

రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ విజయచంద్ర 

కాకతీయ యూనివర్సిటీ,నవంబర్ 26 (విజయక్రాంతి) ప్రజాస్వామ్యం విజయవంతంగా కొనసాగాలంటే రాజ్యము,ప్రజలు, న్యాయవ్యవస్థ, మీడియా పారదర్శకంగా2/4 వ్యవహరిస్తే రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించిన వారమవుతామని కాకతీయ యూనివర్సిటీ న్యాయ కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ విజయచంద్ర అన్నారు. సుబేదారిలోని యూనివర్సిటీ మహిళా కళాశాల లో రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి రాజనీతి శాస్త్ర విభాగ ఇన్చార్జి డాక్టర్ లలిత కుమారి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ చంద్ర మాట్లాడుతూ దేశంలో రాజకీయ మార్పులు వచ్చిన, ప్రభుత్వాలు మారిన దేశ వ్యవస్థ సాఫీగా పని చేయడానికి మనభారత రాజ్యాంగం ఇచ్చిన స్థిరమైన వ్యవస్థ కారణమని, భారత పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వానికి మార్గం చూపే జీవన పత్రం మన రాజ్యాంగం అని, భారత రాజ్యాంగం దేశానికి రక్షణ కవచంగా దేశ స్థిరత్వానికి బలమైన పునాదిగా ఉంటుందని, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఎస్.ఎల్ సౌజన్య మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అనుభవించడంతోపాటు ప్రాథమిక విధులను కూడా తప్పనిసరిగా పాటించినప్పుడే రాజ్యాంగ విలువలని కాపాడిన వారమవుతామని చెప్పారు.సీనియర్ అడ్వకేట్ వీరభద్రరావు మాట్లాడుతూ ఎందరో ప్రాణ త్యాగాల వల్ల మనకు స్వాతంత్య్రం సిద్ధిస్తే, రాజ్యాంగ నిర్మాతలు రచించిన రాజ్యాంగం ద్వారా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశ ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని, రాజ్యాంగ విలువలను, స్పూర్తిని కాపాడే బాధ్యత యువకులపైనే ఉందని చెప్పారు.

డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బాధ్యులు ఏం కవిత మాట్లాడుతూ మహిళలపై జరిగే అఘాయిత్యాలకు, అరాచకాలకు, వేధింపులకు గురైన బాధితులకు న్యాయసహ్యం అందించేందుకు హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  ఎప్పడు అందుబాటులో ఉంటుందనిచెప్పారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజనీతి శాస్త్ర విద్యార్థులకునిర్వహించిన వ్యాసరచన మరియు వకృత్వ పోటీలో గెలుపొందిన విజేతలకు అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ సోమలింగం, డా. మదు, డాక్టర్ బాసాని లావణ్య, డాక్టర్ జెట్టి రాజేందర్, రుబీనా, సురేష్, కరిష్మా, డాక్టర్ తిరుపతి, డిస్ట్రిక్ లీగల్ సెల్ అథారిటీ బాధ్యులు శ్రీకాంత్ మరియు మహిళా కళాశాల విద్యార్థినీలు పాల్గొన్నారు.