27-11-2025 12:43:27 AM
పోలీసు అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ
జిల్లా ఎస్పీ సునిత రెడ్డి
వనపర్తి క్రైమ్, నవంబర్ 26: ప్రజల హక్కుల సంరక్షణలో పోలీసులు కీలక బాధ్యతలు నిర్వర్తించాలని ప్రజల హక్కులే మన బాధ్యత అని రాజ్యాంగ పరిరక్షణ ప్రజాసేవ మా ధర్మం అని భారత రాజ్యాంగ స్పూర్తితో ప్రజలకు సమర్ధవంతంగా సేవలందిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా బుధవారం రోజు జిల్లా కార్యాలయంలో పోలీసులు, అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి రాజ్యాంగ ప్రతిజ్ఞచేయించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ప్రాధమిక హక్కులను కల్పించడమే కాక సమాజ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టాలను రూపొందించిందని పేర్కొన్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ అనే పవిత్ర లక్ష్యాల కోసం ఉన్న పోలీస్ వ్యవస్థకు రాజ్యాంగమే మార్గదర్శకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, డిసిఅర్భి డి ఎస్పీ, బాలాజీ నాయక్, పోలీసు కార్యాలయం ఏ ఓ, సునంద, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాసులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ సునిత రెడ్డి
వనపర్తి క్రైమ్, నవంబర్ 26 : వనపర్తి జిల్లా పోలీసు అధికారి బాధ్యతలు స్వీకరించిన సునిత రెడ్డి బుధవారం జిల్లా ప్రథమ న్యాయస్థానంలో అధికారికంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునిత ని మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసారు. ఈ సందర్బంగా జిల్లా శాంతిభద్రతల పరిరక్షణ, నేర నివారణ చర్యలు, కోర్టుపోలీసు విభాగాల పరస్పర సహకారం, ప్రజా సమస్యల పరిష్కారానికి సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు విపులంగా చర్చించారు.