18-12-2025 02:14:25 AM
నిర్మల్ జిల్లాలో అభ్యర్థుల విజయం
నిర్మల్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో బుధవారం జరిగిన మూడో విడత ఎన్నికల్లో ఒక్క ఓటుతో ఇద్దరు అభ్యర్థులు సర్పంచ్ పదవులు దక్కించుకున్నారు. బైంసా మండలం లింగా గ్రామంలో సుస్మిత రాణి ప్రత్యర్థి స్వాతిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించింది. సుస్మితారానికి 143 ఓట్లు రాగా స్వాతికి 142 ఓట్లు లభించాయి. ము ధోల్ మండలం రూవి ఎన్నికల్లో మల్లేష్ యాదవ్ సమీప ప్రత్యర్థి గంగాధర్‌పై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. మల్లే ష్ యాదవ్‌కు 182 ఓట్లు రాగా గంగాధర్‌కు 181 ఓట్లు వచ్చాయి.