calender_icon.png 30 December, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టార్గెట్ క్లీన్‌స్వీప్

30-12-2025 12:19:06 AM

  1. నేడు భారత్, లంక చివరి టీ20
  2. ఆడిన 4 మ్యాచ్‌లూ గెలిచిన భారత్
  3. సూపర్ ఫామ్‌లో షెఫాలీ వర్మ
  4. సమిష్టిగా రాణిస్తున్న బౌలర్లు

* వన్డే ప్రపంచకప్ విజయం తర్వాత అదే జోరును కొనసాగిస్తూ సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం.. ఆడిన నాలుగు టీ20ల్లోనూ లంకపై అద్భుత విజయాలు.. ఇప్పుడు చివరి మ్యాచ్‌లోనూ గెలిచి ఏడాదిని క్లీన్‌స్వీప్ విజయంతో ముగించే ఛాన్స్ ముంగిట నిలిచింది భారత మహిళల జట్టు... బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ సూపర్ ఫామ్.. బౌలింగ్‌లో సమిష్టిగా రాణిస్తున్న బౌలర్లు.. వెరసి క్లీన్‌స్వీప్ టార్గెట్‌కు భారత జట్టు సిద్ధమైంది. చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి క్లీన్‌స్వీప్ పరాభవాన్ని తప్పించుకోవాలనుకుంటున్న లంక ఆశలు నెరవేరతాయా.. ?

తిరువునంతపురం, డిసెంబర్ 29 : సొంతగడ్డపై జైత్రయాత్ర కొనసాగిస్తూ శ్రీలంకను నాలుగు టీ ట్వంటీల్లోనూ చిత్తు చేసిన భార త మహిళల జట్టు చివరి మ్యాచ్ కు రెడీ అయింది. ఈ ఏడాది వరల్ కప్ గెలిచి అదరగొట్టిన భారత్ ఇప్పుడు క్లీన్ స్వీప్ విజయం తో 2025ను ఘనంగా ముగించాలని ఉవ్విళ్ళూరుతోంది. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ లంకపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ వరుస విజయాలతో చెలరేగిపోతున్న భారత్ చివరి మ్యాచ్‌లోనూ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

తొలి మూడు టీ20లతో పోలి స్తే నాలుగో మ్యాచ్‌లో శ్రీలంక కాస్త పోటీ ఇవ్వగలిగింది. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్‌ను ఓడించాలంటే మాత్రం లంక అంచనాలకు మించి రాణించాల్సిందే.  సీనియర్లతో ఆడినా, రిజర్వ్ బెం చ్ ప్లేయర్స్‌కు అవకాశమిచ్చినా కూడా ప్రతీ ఒక్కరూ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా లేడీ సెహ్వాగ్ షెఫాలీ వర్మ దుమ్మురేపుతోంది. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో లంక బౌలర్ల కు చుక్కలు చూపిస్తోంది. షెఫాలీకి తోడు గత మ్యాచ్‌లో స్మృతి మంధాన కూడా ఫామ్‌లోకి వచ్చేసింది.

భారీ షాట్ల తో అభిమానులను అలరిస్తూ పలు రికార్డులను కూడా అందుకుంది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ అయిన రిఛా ఘోష్ మెరుపులు భారత్‌కు భారీస్కోరు అందించాయి. అయితే ఈ సిరీస్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వ్యక్తిగతంగా సత్తా చాటలేకపోయింది. చివరి టీట్వంటీలోనైనా ఆమె ఫామ్ అందుకుంటుందేమో చూడాలి. ఇదిలా ఉంటే అనారోగ్యంతో నాలుగో మ్యా చ్‌కు దూరమైన జెమీమా రోడ్రిగ్స్ చివరి టీ20లో ఆడడంపై ఇంకా క్లారిటీ లేదు. జెమీమా కూడా మంచి ఫామ్‌లో ఉండగా.. బౌలింగ్‌లో పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా రాణిస్తున్నారు.

రేణుకా సింగ్ పేస్ ఎటాక్ ను లీడ్ చేస్తుండగా.. అరుంధతి రెడ్డి కూడా సత్తా చాటుతోంది. స్పిన్ విభాగంలో ఎప్పటిలాగే దీప్తి శర్మ మ్యాజిక్ చేస్తుంటే.. యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ కూడా అదరగొడుతోంది. అరంగేట్రం నుంచే ఆక ట్టుకుంటున్న వైష్ణవి మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటోంది. కాగా ఇప్పటికే సిరీస్ కైవ సం చేసుకున్న నేపథ్యంలో చివరి మ్యాచ్‌కు సంబంధించి తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది.

రిజర్వ్ బెంచ్ ప్లేయర్స్‌లో కమిలిని తప్ప అందరికీ చోటు దక్కింది. దీంతో చివరి మ్యాచ్‌లో ఆమె అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే శ్రీలంక మహిళల జట్టు నాలుగో టీ20లో మాత్రం ఆకట్టుకుంది. భారీ లక్ష్య ఛేదనలో దూకుడుగానే ఆడి చివరి వరకూ పోరాడింది. ఓపెనర్ హాసినితో పా టు కెప్టెన్ ఆటపట్టు మంచి ఆరంభాన్నే ఇచ్చినా మిగిలిన బ్యాటర్లకు భారత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు.

దీంతో 30 పరుగుల తేడా తో ఓడిపోయింది. అయితే చివ రి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ఆ సిరీస్‌లో లంక బౌలర్లు రాణిస్తున్నా.. బ్యాటర్లు మాత్రం విఫల మవుతుండడం వారికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో బ్యాటర్లు గాడిన పడితే తప్ప భారత్‌ను నిలువరించడం లంకకు అసాధ్యమే. 

గత రికార్డులు

భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకూ 30 టీ ట్వంటీలు జరిగాయి. భారత జట్టు 24 మ్యాచ్‌లలో గెలిస్తే , ఐదింటిలో లంక గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.

పిచ్ రిపోర్ట్

మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న  తిరువునంతపురంలో మరోసారి పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోం ది. నాలుగో టీ20 లో ఇరు జట్లూ 400కు పైగా పరుగులు చేసాయి. మంచు ప్రభా వం అధికంగా ఉండడంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గుచూపొచ్చు.