calender_icon.png 16 September, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి కుక్కల బీభత్సం..

15-09-2025 07:16:35 PM

ముగా జీవాల మృతువాత..

బోథ్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) సొనాల మండలంలోని చింతల బోరి గ్రామములో కుక్కల స్వైర విహారంతో గ్రామంలోని ప్రజలు, విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీధి కుక్కలు దాడితో ఇప్పటికే మూడు గోమాతలు, ఒక లేగ దూడ, ఒక గేదె మృత్యువాత పడ్డాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెబీస్ సోకి రెండు ఆవులు మృత్యువుతో కొట్టుమిట్టాడుతున్నామన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి గ్రామ ప్రజలను, పశువులను కాపాడాలని కోరుతున్నారు. వీధి కుక్కలను చూసి పిల్లలు బడికి వెళ్లడం మానేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.