17-09-2025 12:00:00 AM
చేగుంట, సెప్టెంబర్ 15 :చేగుంట మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారిని ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఎంఈఓ నీరజ , తహసిల్దార్ శ్రీకాంత్ సోమవారం ఘనంగా సన్మానించారు. ఉ పాధ్యాయ వృత్తి ఎంతో ప్రాముఖ్యమైనదని, దేశ భవిష్యత్తు తరగతి గదులలో నిర్మింపబడుతుందని అన్నారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, ఉపాధ్యాయులు జాతి ని ర్మాతలని, సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదట ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అంచలంచలుగా ఎదిగి రాష్ట్రపతిగా అయి ఆ వృత్తికి వన్నెతెచ్చిన మహానుభావుడు అని అన్నారు.
మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఎం.అనిత, ఎం.శ్రీవాణి, ఎన్.సంతోషి, ఎన్.ధనుంజయ, కే.సునీత, పి.భవాని, ఎస్.బి.ఆర్ సరస్వతి, ఎంఏ.నయీమ్, జీ.శారద, సౌజన్య, రమ్యశ్రీ, ఆర్.సత్యనారాయణ, కే.విజయేందర్ రెడ్డి, టి.రాములు, కే.మురళీకృష్ణ, బి.శంకర్రావు, పి.ఊర్మిళ, టి.ఎల్లయ్య, వి.కిషన్, జిల్లా అవార్డు గ్రహీతలు జీ.రాధ, ఎన్.శంకర్, ఎం శ్రీలత,మరియు సి అర్ పి రమేష్, ప్రవీణ్, వినోదలను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిజిహెచ్‌ఎంలు అమర్, శేఖర్ రెడ్డి, చంద్రకళ, కృపాకర్ రెడ్డి, కృష్ణారావు, ఉపాధ్యాయుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.