calender_icon.png 23 July, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రైలర్ అప్పుడే..

23-07-2025 12:07:25 AM

విజయ్ దేవరకొండ ఇప్పుడు ‘కింగ్‌డమ్’తో రాబోతున్నారు. శ్రీలంక బ్యాక్ డ్రా ప్‌లో బ్రదర్స్ ఎమోషన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ దాదా పు రూ.130 కోట్ల వరకు వెచ్చించి నిర్మిస్తున్న  ఈ చిత్రమిది.

ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక కాగా, సత్యదేవ్ విజయ్ దేవరకొండకు అన్న పాత్రలో కనిపించనున్నారు.  జూలై 31న విడుదల కానున్న ఈ సినిమా నుం చి ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసిన టీమ్.. ప్రస్తుతం ప్రమోషన్స్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ట్రైలర్‌ను సైతం రిలీజ్ చేయనుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జూలై 26న తిరుపతిలో చేయనున్నట్టు మేకర్స్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే టీజర్‌తో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌తో మరింత హైప్ పెరగనుంది.