31-10-2025 01:46:59 AM
 
							స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘కాంత’. 1950 మద్రాస్, సినిమా గోల్డెన్ ఏజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న పీరియాడికల్ డ్రామా ఇది. ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సంయుక్తగా నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 14 థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం నుంచి మేకర్స్ ‘రేజ్ ఆఫ్ కాంత’ పేరుతో ర్యాప్ ఆంథమ్‌ను గురువారం విడుదల చేశారు. హీరో రోల్ ఎలా ఉంటుందో తెలియజేసే ఈ సాంగ్‌ను ఝాను చాంతర్ స్వరపర్చగా, సిద్ధార్థ్ బస్రూర్ పాడారు. ‘నిజం నేనే ఇజం నేనే.. పడిపడి లేచె అలల తల పొగరుని.. నిశి నేనే శశి నేనే.. పిడుగు పడిన పడనే పడదు వెనకడుగు’ అంటూ సాగుతున్న ఈ గీతానికి తమిళ సాహిత్యాన్ని యోగి బీ, డేవిడ్ అందించగా.. ఇంగ్లిష్ లిరిక్స్‌ను లూనార్ పంక్, తెలుగు సాహిత్యాన్ని అభినవ కవి అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్; ఆర్ట్: థా రామలింగం; ఎడిటర్: లెవెలిన్ ఆంథోనీ గోన్సాల్వెస్.