31-10-2025 01:48:03 AM
 
							బాలకృష్ణ, బోయపాటి శ్రీను కొలాబరేషన్‌లో వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాను రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. హీరోయిన్ సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ శక్తిమంత మైన పాత్ర పోషిస్తుండగా, హర్షాలి మల్హోత్రా కీలక పాత్ర లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ఓ అప్‌డేట్ వచ్చింది.
ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఇంతకుముందు సంస్కృత శ్లోకాలను పఠించే నైపుణ్యం ఉన్న పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులతో స్కోర్‌ను రికార్డ్ చేశారు. ఇప్పుడు ‘అఖండ2’ కోసం సర్వేపల్లి సిస్టర్స్ శ్రేయ, రాజలక్ష్మిలను పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఈ సంగీత సోదరీ ద్వయం ఆలాపనలు వినిపించనున్నాయి. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రానికి సీ రాంప్రసాద్, సంతోష్ డీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.