18-06-2024 12:05:00 AM
తెలంగాణ రాష్ట్రం సాధించడంలో బతుకమ్మ పండుగ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఇటీవలి రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ప్రధానంగా ప్రభుత్వ మార్పును కోరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది మహిళా శక్తియే. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మహిళలు అంటే అత్యంత గౌరవం. ఎన్నికలలో చేసిన వాగ్దానం ప్రకారం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ‘మహాలక్ష్మి పథకం’ కింద ‘ఉచిత బస్సు ప్రయాణం’ కల్పిస్తున్నారు.
ఇంకా గ్యాస్ సిలిండర్‌లో రాయితీకూడా ఇస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యం గల మహిళలకు తెలంగాణలో శాశ్వతంగా నిరంతరం స్మరించుకొనే విధంగా కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి ‘బతుకమ్మ’ పేరు పెట్టడం ఎంతైనా సముచితం. బతుకమ్మ పండుగను, తెలంగాణ ఔన్నత్యాన్ని జాతీయ అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశమూ వుంటుంది.
దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్