calender_icon.png 22 August, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ఖాళీలు డీయస్సీలో కలపాలి

18-06-2024 12:05:00 AM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ ప్రక్రియ ద్వారా ఏర్పడే 9 వేల ఉపాధ్యాయ ఖాళీలు ప్రస్తుతం ఉన్న డీయస్సీ నోటిఫికేషన్‌లో జత చేసి లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెగా డీయస్సి ద్వారా 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఎన్నికల్లో పెద్ద ఎత్తున డీయస్సీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులకు కొత్త ప్రభుత్వం మరో 6 వేల టీచర్ పోస్టులు మాత్రమే జత చేసి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.

గత 8 సంవత్సరాలుగా టీచర్ పోస్టులు భర్తీ కాలేదు. 33 జిల్లాల వారీగా చూస్తే ఇప్పుడు వచ్చిన డీయస్సీలో స్వల్ప సంఖ్యలోనే పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే సింగిల్ డిజిట్‌లోనే ఖాళీలు ఉన్నాయి. యస్‌జీటీ పోస్టులుకూడా చాలా జిల్లాల్లో తక్కువ సంఖ్యలోనే ఇచ్చారు. అయితే, ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ ప్రక్రియద్వారా 9 వేల కొత్త ఖాళీలు ఏర్పడనున్నాయి. ఈ ఖాళీలుకూడా ప్రస్తుత డీయస్సీలో జత చేసి లక్షలాది మంది అభ్యర్థులకు న్యాయం చేయాలి. హేతుబద్ధీకరణ అంటూ టీచర్ పోస్టులు కుదించకుండ మొత్తం ఖాళీలు ప్రస్తుత డీయస్సీలోనే కలపాలి. అలాగే, డీయస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌లో కాక ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలి.

 రావుల రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు

తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం