calender_icon.png 17 May, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ అధికారుల ఇష్టారాజ్యం

17-05-2025 12:00:00 AM

  1. 24 గంటల 11కేవీ విద్యుత్ లైన్ నుంచి వ్యవసాయానికి ట్రాన్స్ ఫార్మర్లు 
  2. సిద్దిపేట డివిజన్లో సుమారు 10 అక్రమ కనెక్షన్లు 
  3. లక్షల్లో చేతులు మారిన డబ్బులు 
  4. డిపార్ట్మెంట్ బడ్జెట్ నుంచి ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు
  5. విజయక్రాంతి కథనాలతో అధికారుల దిద్దుబాటుకు యత్నం 

సిద్దిపేట, మే 16 (విజయక్రాంతి): సిద్దిపేట డివిజన్ విద్యుత్ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును దు బారా చేస్తూ ప్రజల సొమ్మును జేబులో వే సుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. యదేచ్చగా 24 గంటల విద్యుత్ లైన్ నుంచి అగ్రికల్చర్ ట్రాన్స్ ఫార్మర్లకు కనెక్షన్లు ఇస్తూ.. అట్టి ట్రాన్స్ ఫార్మర్లకు అయ్యే ఖర్చుకు డిపార్ట్ మెంట్ బడ్జెట్ ను వినియోగిస్తున్నారు.

ప్రభుత్వ సొమ్మును వినియో గిస్తూ ప్రజల నుంచి వచ్చే సొమ్మును జేబులో వేసుకుంటున్నారు. ఈ కనెక్షన్లు కమర్షియల్ పనులకు వినియోగిస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఈ తతంగమంతా జిల్లా అధికారులకు తెలిసిన చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ నోట ఈ నోట విజయక్రాంతి దృష్టికి రావడంతో మే 1నాడు ఈ విషయాన్ని విజయక్రాంతి ప్రచురించిం ది.

దీంతో మేల్కొన్న విద్యుత్ శాఖ అధికారులు మరో తప్పు చేసేందుకు యత్నిస్తు న్నట్లు తెలుస్తుంది. డిపార్ట్మెంట్ బడ్జెట్ నుం చి 24 గంటల ట్రాన్స్ఫార్మర్ లైన్ ను అగ్రికల్చర్ లైన్ గా మార్చేందుకు ప్రభుత్వ ఖజా నా నుంచే డబ్బు(టీ&డీ బడ్జెట్)ను వినియోగించేందుకు యత్నాలు చేస్తున్నట్లు సమాచా రం. ఇందుకు జిల్లా ఉన్నతాధికారులు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తుంది.

సిద్దిపేట డివిజన్‌లో దాదాపు పది అక్రమ కనెక్షన్లు 

సిద్దిపేట డివిజన్ పరిధిలోని తడకపల్లి, మిట్టపల్లి, ఎన్సాన్పల్లి, అక్బర్ పేట- భూం పల్లి, బక్రి చెప్యాల, పొన్నాల గ్రామాల్లో ఫా మ్ హౌస్ లకు, డైరీ ఫార్మ్, కోళ్ల ఫారాలకు నిబంధనలకు విరుద్ధంగా 24 గంటల కరెంటు నుంచి అగ్రికల్చర్ కు కనెక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వినియోగదారుల నుంచి లక్ష ల్లో ముడుపులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా డిపార్ట్మెంట్ బడ్జెట్ నుంచి డబ్బు లు వెచ్చించి కనెక్షన్లు అందించినట్లు తెలుస్తుంది.

డబ్బులు ఇచ్చినా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న అధికారులు సాదాసీదా రైతులకు అరకొర కరెంటును ఇస్తున్నారని తోటి రైతులు వాపోతున్నారు. ఈ తతంగంపై గతంలో విచారణ చేపట్టిన ఓ అధికారి తన పై అధికారికి నివేదికను సమర్పించారు. ఈ నివేదికను సదరు ఉన్నతాధి కారి ఏదో ఆశించి తొక్కి పెట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారికి ఈ విషయం తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. 

మరోసారి డబ్బులు దుబ్బారా చేసేందుకు యత్నం

విజయక్రాంతి ద్వారా 24 గంటల కరెం టు లైన్ పై వ్యవసాయానికి విద్యుత్ కలెక్షన్ ఇచ్చినట్లు బయటికి రావడంతో దిద్దుబాటు చర్యలను విద్యుత్ శాఖ అధికారులు చేపట్టినట్లు తెలుస్తుంది. మరోసారి విద్యుత్ శాఖ బడ్జెట్ నుంచే డబ్బులు వెచ్చించి అగ్రికల్చర్ లైన్ గా మార్చేందుకు ప్రయత్నాలను ము మ్మరం చేస్తున్నట్లు సమాచారం.

ఈ సమాచారాన్ని సదరు వినియోగదారులకు తెలప డంతో వినియోగదారులు తాము డబ్బులిచ్చి విద్యుత్ సరఫరా తీసుకున్నామని, దానిని మార్చేందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు ఓ అధికారి కీలక పాత్ర వహిస్తున్నారని, సదరు అధికారికి మరో ఇద్దరు అధికారులు  సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.