calender_icon.png 17 May, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనిచేసే కార్యకర్తలకు పార్టీతోనే గుర్తింపు

17-05-2025 12:00:00 AM

  1. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్

నిర్మల్, మే 16 (విజయక్రాంతి): పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలకు ఏదో ఒక సందర్భంలో పార్టీ గుర్తింపు ఇస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నా రు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో పట్టణ నూతన కమిటీ ఎన్నికైన సభ్యులను సన్మా నం చేసి మాట్లాడారు. నిర్మల్ పట్టణం జిల్లా కేంద్రం కావడంతో ప్రభుత్వ పథకాలను ప్ర జల తీసుకెళ్లి మోదీ నాయకత్వంపై ప్రజల్లో చైతన్యం తేవాలని కార్యవర్గానికి సూచించారు.

అనంతరం నూతన కార్యవర్గ సభ్యులకు సన్మానం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నికైన కొండ శ్రావణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, జిల్లాలోని మండల అధ్యక్షులు సాయినాథ్, శ్రీనివాస్, నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు తలోడ్ శ్రీనివాస్, యోగేష్ , రాహుల్ పాల్గొన్నారు.