23-01-2026 03:42:37 PM
ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొరికేని దయానంద్
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొనికేని దయానంద్ అన్నారు .ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఖానాపూర్ లో నిర్మించాలని జేఏసీ ఆధ్వర్యంలో ఖానాపూర్ బంద్ పాటిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖానాపూర్ అభివృద్ధి జరుగుతుందని గతంలో పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఖానాపూర్ పట్టణ ప్రధాన రహదారి ఇతర అభివృద్ధి పనులలో ఆటంకం చోటుచేసుకుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖానాపూర్లో వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని ప్రధాన రహదారి కూడా పూర్తి చేస్తామని, మరో పాఠశాలను ఖానాపూర్లో నిర్మించేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని వారు అన్నారు.
త్వరలోనే డిగ్రీ కళాశాల కూడా మంజూరు అయితుందని అన్నారు. ప్రస్తుతం ఖానాపూర్ అభివృద్ధి అని రాద్ధాంతం చేస్తున్నవారు గతంలో ప్రభుత్వం ఖానాపూర్ కు సంబంధించిన సదర్ మాట్ ఆనకట్టను నిర్మల్ కు తరలించకపోయినప్పుడు ఏం చేశారని..? వారు ఎద్దేవా చేశారు .ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే ఖానాపూర్ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని ఇదివరకే ఎన్నో అభివృద్ధి పనులు ప్రారంభించామని వారు అన్నారు. ఈ సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, మాజీ మున్సిపల్ చైర్మన్ లు రాజుర సత్యం, అంకం రాజేందర్, మాజీ కౌన్సిలర్లు కావాలి సంతోష్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి షబ్బీర్ పాష, పట్టణ అధ్యక్షులు మిమ్ముల రమేష్, జంగిలి శంకర్, గొర్రె గంగాధర్ ,గంగ నరసయ్య ,నయీమ్ ,జూని ,జహీర్, తదితరులు ఉన్నారు.