calender_icon.png 23 January, 2026 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుల వరదాయినిగా ఏడుపాయల వనదుర్గమ్మ

23-01-2026 03:31:46 PM

వసంత పంచమిని పురస్కరించుకొని సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

పాపన్నపేట,జనవరి 23(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గమ్మ వసంత పంచమిని పురస్కరించుకొని చదువుల వరదాయినిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామునే అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకం, అర్చనలు నిర్వహించి సరస్వతి దేవి రూపంలో సుందరంగా అలంకరించారు. పుస్తకాలు, పెన్నులు, వీణ, వివిధ రకాల పుష్పాల అలంకరణలో అమ్మవారు శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు.