calender_icon.png 23 January, 2026 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి

23-01-2026 03:29:56 PM

లైబ్రేరియన్  మృదులా

కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు కార్యదర్శి కే. కరుణ కుమారి  ఆదేశానుసారం శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఓటర్ల ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథ పాలకురాలు జి మణి మృదులా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా కుల, మత,వర్గ భాష భేదాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుగా భావించి అందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులతో పాటు గ్రంథాలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.