calender_icon.png 20 September, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తలే పార్టీకి బలం.. బలగం

20-09-2025 12:53:44 AM

- బిఆర్‌ఎస్ పార్టీ పటిష్టంగానే ఉంది

- కోనరావుపేట మండల విస్తృత స్థాయి సమావేశంలో బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు

కోనరావుపేట సెప్టెంబర్ 19 : జిల్లాలో భారతీయ రాష్ర్ట సమితి పార్టీ కెసిఆర్ సారథ్యంలో పటిష్టంగా ఉందనీ.. కార్యకర్తలే పార్టీకి బలం బలగమని, దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తులు ఎవరు చెరుపలేరని, కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదితో ప్రభుత్వం ఏర్పాటు చేసి 22 నెలల్లో ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత ను ఎదుర్కొంటుందని బిఆర్‌ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.

శుక్రవారం కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామంలో మండల స్థాయి విస్తృత సమావేశాన్ని వారు ఏర్పాటు చేసి కార్యకర్తలతో మాట్లాడారు. ముందుగా మండలంలోని ప్రతి గ్రామం నుండి కార్యకర్తల తో మాట్లాడించారు. వారు చెప్పిన సలహాలను సూచనలను పరిగణలోకి తీసుకొని పార్టీని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ నుండి వెళ్లినవారు బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పెద్ద పదవులు అనుభవించి ఇప్పుడు  పదవి వ్యామొహంపై పార్టీ నుండి వెళ్లారని,  ఒక్కరో.. ఇద్దరూ పార్టీ మారినంత మాత్రాన మాకు జరిగే నష్టం ఏం లేదన్నారు. ఇంకా మా పార్టీలో గులాబీ సైనికులు ఉన్నారని స్థానిక సంస్థలు పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు.

స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో  విఫలమవుతున్నారని, కేవలం ఫోటోలకు ఫోజులకు పరిమితమే అవుతుందని,  ప్రజా పాలన అంటే  ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలని అన్నారు. ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్నలకే మలకపేట రిజర్వాయర్ కు నీళ్లు వదిలారని, వేములవాడలోనీ మూలవాగు రెండో వంతెన పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు గురించి ఫ్లెక్సీ లలో ప్రతి మండలంలో ఆయా గ్రామాల్లో పెట్టిస్తే ఓుంవలేని కాంగ్రెస్ నాయకులు మా పార్టీ కార్యకర్తలపై అనవసరపు కేసులు పెడుతున్నారన్నారు. విప్ ఆది శ్రీనివాస్  సొంత గ్రామమైన రుద్రంగిలో యూరియా కొరత ఉందని అడిగితే వెంటనే అక్కడికి యూరియా బస్తాలు పంపించారనీ... ఇది మీ ప్రజా పాలన ఒకరు చెబితే తప్ప మీకు పాలన అంటే ఏంటో తెలియడం లేదు

. మీ ముఖ్యమంత్రికి హైడ్రా లో పనిచేసే వారికి జీతాలు ఇవ్వడం తెలియదు.. బాధితులు నేరుగా సోషల్ మీడియాలో ప్రభుత్వం గురించి వారి పాలన గురించి పోస్టులు పెడుతున్నారు. ఇది మీరు చేస్తున్న పాలన అని మేము గుర్తు చేస్తున్నామన్నారు. ఒకవైపు బండి సంజయ్ ని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. మోడీ ప్రభుత్వం పది ఏళ్లలో యూరియా కొరత లేదని ఒకసారి అంటాడు.. మళ్ళీ కొత్తగా కేంద్రం నుండి యూరియా కొరత  ఉందని అంటున్నారు. పొంతన లేని సమాధానాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి పాలన చేస్తున్నారన్నారు.

ఏది ఏమైనా మా పార్టీ మాత్రం కెసిఆర్ సారథ్యంలో ఎంతో పటిష్టంగా ఉంది .. మళ్లీ  కెసిఆర్ ముఖ్యమంత్రి గా తెలంగాణ ప్రజలకు పాలన అందించి అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారని కార్యకర్తలకు ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో  మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, సీనియర్ నాయకులు రాఘవరెడ్డి,మాజీ ఎంపీపీ చంద్రయ్య, మాజీ మార్కెట్ కమిటీ చెర్మైన్ ప్రభాకర్ రావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ రామ్ మోహన్ రావు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పరశురాములు,  యూత్ నాయకులు జీవన్ గౌడ్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.