calender_icon.png 12 September, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందువుల ఐక్యతతో ప్రపంచానికి మేలు

08-02-2025 12:00:00 AM

హిందూ ఏక్తా సమ్మేళన్ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

తిరువనంతపురం, ఫిబ్రవరి 7: కులం, ప్రాంతం, భాష వంటి వాటితో సంబంధం లేకుండా హిందువులందరూ ఐక్యంగా ఉం టే ప్రపంచానికి మేలు జరుగుతుందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నా రు. కేరళలోని పతనంతిట్ట కేంద్రంగా జరిగిన హిందూ ఏక్తా సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ‘ఐక్యంగా ఉన్నప్పుడు మాత్ర మే హిందూ సమాజం వృద్ధిలోకి వస్తుంది. కులం, మతం, ప్రాంతం వంటి వాటితో సంబంధం లేకుండా హిందువులందరినీ ఒ కటిగా పరిగణించాలి.

ఒకవేళ హిందువులు అందరూ ఐక్యంగా ఉంటే.. ప్రపంచానికి మే లు జరుగుతుంది’ అని పేర్కొన్నారు. హిం దూ సమాజానికి ఐక్యత చాలా ముఖ్యమని తెలిపారు. ఐక్యత వల్ల సమాజం శక్తి పెరుగుతుందన్నారు.

ఎక్కడైనా ఐక్యంగా ఉన్న స మాజాలు వృద్ధిలోకి వస్తాయని లేదంటే అంతం తప్పదన్నారు. చరిత్రను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు.