calender_icon.png 12 July, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నను దారుణంగా చంపిన తమ్ముడు

12-07-2025 12:05:52 AM

  1. ట్రాక్టర్ కిరాయి విషయంలో గొడవ
  2. కల్లు సీసా పగులగొట్టి పొడిచిన తమ్ముడు
  3. బండరాళ్లతో మోది, మెడకు రుమాలు చుట్టి హత్య
  4. మెదక్ జిల్లా అంసానిపల్లి పరశురాం తండాలో ఘటన

మెదక్, జూలై 11 (విజయక్రాంతి): ట్రాక్టర్ కిరాయి విషయంలో తలెత్తిన గొడవలో సొం త అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేసి న ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్‌పల్లి పరశురాంతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. పరశురాం తండాకు చెంది న మంట్యా(45), మోహన్ అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా పెరిగారు. అయితే కొన్ని రోజులుగా ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది.

శుక్రవారం తండాలోని కల్లు కాంపౌండ్ వ ద్ద ఉండగా మత్తు లో ఉన్న మోహన్.. అన్నపై దాడికి దిగా డు. కల్లు సీసా పగులగొట్టి కిరాతకంగా పొడిచాడు. బండరాళ్లతో మోది, మెడకు రుమాలు చుట్టి ఊపిరి పోయేవరకు బిగించి పట్టుకుని చంపేశాడు. అక్కడున్న వారంతా చూస్తున్నారే తప్పా ఒక్కరు కూడా ఆపేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. కాగా మంట్యాకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ, స్థానిక ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.