19-05-2025 12:57:13 AM
టాలీవుడ్ నిర్మాతల పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ రొట్టె చం దంగా మారింది! సినిమాలను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఆకస్తిచూపక, ఫైరసీ రక్కసితో పోరు పడలేక ఉన్న ప్రొడ్యూసర్లకు ఎగ్జిబిటర్లు పెద్ద షాకిచ్చినట్టయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ పాటించాలని నిర్ణయించారు.
పెద్ద సినిమాలన్నీ జూన్ తర్వాతే రిలీజ్‌కు ఉన్నాయి. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం నిర్మాతలకు పెద్ద షాక్ తగిలినట్టయ్యింది. హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఆదివారం ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సురేశ్‌బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొ న్నారు. పర్సంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చలు జరిగాయి.
ఈ విషయంలో నిర్మాతలకు లేఖలు రాయాలని నిర్ణయించారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని, పర్సంటేజ్ ప్రకారంగా చెల్లించాలని ఎగ్జిబిటర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి డిస్ట్రిబిటర్లు ఒప్పుకోవడంలేదు. తాజా సమావేశంలో ఇదే విషయమై తీవ్రస్థాయిలో వాదోపవాదాలు నడిచాయి.
నైజాంలో వాటాలు ఇలా..
గతంలో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఎగ్జిబిటర్లు పర్సంటేజీ ప్రకారంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం సినిమాకు వచ్చిన కలెక్షన్లలో ఎవరికి ఎంత చెల్లించాలనేది నిర్ణయించారు. ఆ ప్రకారంగా నైజాం ఏరియా లెక్కలను పరిశీస్తే.. రూ.ముప్పు కోట్లకు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం మొత్తం బాక్సాఫీస్‌లో 75 శాతం కలెక్షన్లు డిస్ట్రిబ్యూటర్లకు, 25 శాతం ఎగ్జిబిటర్లకి చెందు తాయి.
రెండో వారంలో 55 శాతం డిస్ట్రిబ్యూటర్లకు, 45 శాతం ఎగ్జిబిటర్లకు, మూడో వారం 40 శాతం డిస్ట్రిబ్యూటర్లకు, 60 శాతం ఎగ్జిబిటర్లకు, నాలుగో వారం 30 శాతం డిస్ట్రిబ్యూ టర్లకు, 70 శాతం ఎగ్జిబిటర్లకు చెందేలా నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే, రూ.10- కోట్ల మధ్య హక్కులు కలిగిన సినిమాల విషయంలో.. మొదటివారం వచ్చిన ఆదాయంలో 60 శాతం డిస్ట్రిబ్యూటర్లకు, 40 ఎగ్జిబిటర్లకు, రెండో వారం 50 శాతం డిస్ట్రిబ్యూటర్లకు,
50 శాతం ఎగ్జిబిటర్లకు, మూడో వారం 40 శాతం డిస్ట్రిబ్యూటర్లకు, 60 శాతం ఎగ్జిబిటర్లకు, నాలుగో వారం 30 శాతం డిస్ట్రిబ్యూటర్లకు, 70 శాతం ఎగ్జిబిటర్లకు ఇవ్వాలని నిర్ణయించారు. అదే రూ.పది కోట్ల లోపు హక్కు లున్న సినిమాలకైతే.. మొదటి వారం వసూళ్లలో 50 శాతం డిస్ట్రిబ్యూటర్లకు, 50 శాతం ఎగ్జిబిటర్లకు, రెండో వారం 40 శాతం డిస్ట్రిబ్యూటర్లకు, 60 శాతం ఎగ్జిబిటర్లకు, మూడో వారంలో 30 శాతం డిస్ట్రిబ్యూటర్లకు, 70 శాతం ఎగ్జిబిటర్లకు అనుకున్నారు.