19-05-2025 12:59:00 AM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘భైర వం’. ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లు కథానాయికలు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 30న విడు దల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఆదివారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. గ్రామస్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీ కగా ఉన్న వారాహి ఆలయం చుట్టూ తిరుగుతుందీ కథాంశం.
ఆ ఆలయ భూములపై కన్నపడిన దేవాదాయ ధర్మాదాయ (ఎండోమెంట్) శాఖ మంత్రి.. వాటిని వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగించాలనే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గ్రామ శాంతికి భంగం వాటిల్లుతుంది. అప్పుడు ముగ్గురు స్నేహితులు కలిసి ఆలయాన్ని, దాని వారసత్వాన్ని రక్షించేందుకు పూనుకుంటారు. ఈ నేపథ్యంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటిన్నదే సినిమా అని తెలుస్తోంది.
యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా శివ తాండవం సీక్వెన్స్ ప్రశంసలు అందుకునేలా ఉంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హరి కే వేదాంతం; సంగీతం: శ్రీచరణ్ పాకాల; ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి; ఎడిటర్: చోటా కే ప్రసాద్.