01-10-2025 12:00:00 AM
తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో 7,65,705 మంది విద్యార్థులు నివాసం ఉంటున్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఇటీవలే 10 నెలల క్రితం డైట్ చార్జీలు పెంచేందుకు అప్పటి బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి, ప్ర స్తుత టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనల మేరకు డైట్ చార్జీలు 40 శాతం పెంచింది.
ఉన్నతాధికారుల కమిటీ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) సూచనలను పరిగణలోకి తీ సుకొని, చివరిసారిగా 2017లో మెస్ చా ర్జీల పెంచినప్పుడు నిత్యావసరాల ధరలు, ప్రస్తుతం రెండు రెట్లు పెరిగిన ధరలను బేరీజు వేసుకొని, సుమారు 22 రకాల నిత్యవసరాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరుగుదల అధ్యయనం చేసింది.
ఈ నేపథ్యంలో పలు సూచనలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేం దుకు 40 శాతం డైట్ చార్జీలు పెంచాలని, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణకు 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచాలని ఉన్నతాధికారుల కమిటీ ప్రభుత్వం ఎదుట పలు ప్రతిపాదనలతో కూడిన రిపోర్ట్‌ను ఉంచిం ది. ఉన్నతాధికారుల కమిటీ.. మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని సూచన చేస్తూనే, మరొకవైపు ప్రతి నెలా వసతి గృహాలకు గ్రీన్ ఛానల్ ద్వారా డైట్ బిల్లులు చెల్లించాలని కోరింది.
కొన్ని రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు, కొమురం భీమ్ ఆసిఫాబాద్‌లో విద్యార్థిని మరణించడం కారణంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తమపై వస్తున్న వ్యతిరేకతను దారి మళ్ళించడం కోసం.. తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి మెస్ చార్జీలు పెంచాలని వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక రాష్ర్టవ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో డైట్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
మం త్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అమలుకు సాధ్యం కాని.. ప్రభుత్వమే తయారు చేసిన కామన్ మె నూతో హంగూ, ఆర్భాటంగా నూతన డైట్‌ఛార్జీల అమలు ప్రారంభమని, ఇక విద్యా ర్థులకు ఆకలి బాధలు ఉండవని, ఫుడ్ పా యిజన్ ఘటనలు పునరావృతం కావని, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణకు తగు చర్యలు తీసుకొని 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచినట్లు ప్రజాప్రతినిధులు అసాధ్యమైన హామీలిచ్చి సన్నాయి నొక్కులు నొ క్కారన్నది వాస్తవం.
హామీలు గాలికి
రాష్ర్ట ప్రభుత్వం బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల కమిటీ చేసిన ప్రతిపాదనల్లో కేవలం మెనూ చార్జీ లు పెంచడం మాత్రమే కాదు, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా డైట్ చార్జీలు సంక్షేమ వసతి గృహాలకు చెల్లించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రతీనెల డైట్‌చార్జీలు చెల్లించకుండా, విద్యార్థులకు పెంచిన డైట్ చార్జీలతో డైట్ అందించడం సాధ్యపడదు.
గతం కంటే నేడు పెరిగిన చార్జీలతో విద్యార్థులకు డైట్ అందిస్తున్న కారణంగా సంక్షేమ వసతి గృహాధికారులకూ డైట్ చార్జీలు సకాలంలో చెల్లించక పోవడంతో అదనపు భారంగా మారింది. ఫైనాన్షియర్ల దగ్గర వడ్డీలు, ఈఎంఐలతో పర్సనల్ లోన్లు తీర్చడం.. తమ పుస్తెలతాడులమ్మి తాకట్టు పెట్టి సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు రెగ్యులర్ మెనూ ప్రకారం భోజనం అందించా ల్సిన దుస్థితి ఏర్పడింది.
రాష్ర్టంలో సుమా రు 2,300 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహా లు, 400కు పైగా గురుకులాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ప్రైవేటు బిల్డింగ్ ఓనర్లకు కిరాయిలు చెల్లించకపోగా బిల్డింగులకు తాళాలు వేసిన సందర్భాలు లేకపో లేదు. భవనాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని యాజమానులు తగువుకు దిగుతున్న ఘటనలు రాష్ర్ట వ్యాప్తంగా చూస్తున్నాం. కరెంట్ బిల్లులు చెల్లించకపోయినా డిస్కం లు మాత్రం నిరంతరాయంగా పవర్ సప్లు చేస్తునే ఉన్నాయి.
సంక్షేమ వసతి గృహాలకు, గురుకులాలకు నిత్యవసర వస్తువు లైన కూరగాయలు, పాలు, కోడిగుడ్లు, చికెన్, అరటిపండ్లు సరఫరా చేసే టెండర్ దారులు తమ బిల్లులు చెల్లించకపోవడంతో వారు చేతులెత్తేశారు. కొన్నిచోట్ల 15 రోజులకు సరిపడా ఒకేసారి కూరగాయలు వేస్తే మురిగిపోతున్న సందర్భాలు ఉన్నా యి. ప్రభుత్వం ఇటు టెండర్ దారులకు, బిల్డింగ్ ఓనర్లకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో సంక్షేమ వసతి గృహాల అధికారులు, గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులపైన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేజీబీవీలపై వివక్ష
కేజీబీవీల్లో చదువుకునే విద్యార్థులు ఇతర గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులతో పోలిస్తే తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయుల కొర త, మౌలిక సదుపాయాలు, నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇతర విద్యార్థులతో పోల్చినప్పుడు తమకు కల్పిస్తున్న సదుపాయాలు చాలా పరిమితమైనవి. అక్కడ పని చేసే ఉద్యోగులు తమని పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవిత భీమా, ఆరోగ్య భీమా తమకు వర్తింపజేయాలని కోరుతున్నారు.
అంతేకాదు 20 సంవత్సరాలుగా శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులు చాలామందే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేజీబీవీల పట్ల వివక్ష వీడి న్యాయం చేయాలని వాపోయారు. తెలంగాణ రాష్ర్టంలో ప్రతియేటా సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. వసతి గృహాల వ్య వస్థ నిర్వీర్యం అవుతోంది. నాసిరకం భోజ నం, అపరిశుభ్ర పరిసరాలు, వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు, అధికారుల నిర్లక్ష్యం, చాలీ చాలని తిండి కారణంగా తల్లిదండ్రు లు విసుగెత్తి వసతి గృహాల నుంచి విద్యార్థులను ఇండ్లకు తీసుకెళ్లిపోతున్నారు. దీంతో ఏటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తుంది.
తగ్గుతున్న విద్యార్థులు
ముఖ్యంగా ఈ ఏడాది బీసీ, ఎస్సీ వస తి గృహాల్లో విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. ఉదాహరణకు ఖమ్మం జిల్లా తీసుకుంటే వెనుకబడి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రీ మెట్రిక్ పరిధిలో 53 బాలుర, 10 బాలికల బీసీ వసతి గృహా లు ఉన్నాయి. వీటిలో 2024 విద్యా సంవత్సరంలో బాలురు 4,091 మంది, బాలికలు 1070 మంది కలిపి మొత్తంగా 5,086 మంది ఉండేవారు.
అయితే ప్ర స్తుత విద్యా సంవత్సరములో బాలురు 3,269 మంది, బాలికలు 894 మంది కలి పి మొత్తం 4,163 మంది ఉన్నారు. అంటే ఒక ఏడాది కాలంలో 923 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే విధంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 17 బాలురు, 14 బాలికల ఎస్సీ వసతి గృహా లు ఉన్నాయి. వీటిలో 2024 విద్యా సంవత్సరంలో బాలురు 1,352 మంది, బాలికలు 1,438 మంది కలిపి మొత్తంగా 2,790 మంది విద్యార్థులు ఉండేవారు.
కాగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో బాలు రు 1,122 మంది, బాలికలు 1,110 మంది కలిపి మొత్తం 2,232 మంది ఉన్నారు. అంటే ఒకే ఏడాది కాలంలో 558 మంది తగ్గారు. దీన్నిబట్టి బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు ఎలా ఉన్నాయన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఒక్క బీసీ సంక్షేమ వసతి గృహాలకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, గిరిజన వసతి గృహాల్లోనూ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారైంది.
వసతి గృహాల్లో, గురుకులాల్లో ప్రతి ఏటా నిర్వహణ కోసం కేటాయించే బడ్జెట్ కూడా ఇవ్వకపోవడంతో వసతి గృహాల్లో, గురుకులాల్లో శానిటేషన్ ఇబ్బందులు ఎదుర వుతున్నాయి. పాత భవనాలు శిథిలావస్థకు చేరడంతో పెచ్చులూడి ప్రమాద కరంగా మారుతున్నాయి.
వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి వసతి గృహాలపై దృష్టి సారిం చి తగు సదుపాయాలు కల్పించాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రభుత్వ విధానాలతో సంక్షేమ వసతి గృహాలు మూతప డే పరిస్థితి రావొచ్చు.