01-10-2025 12:00:00 AM
సంఘా హి సంహతత్వాత్ అధృష్యాః పరేషామ్..
(కౌటిలీయం - 11- )అరిస్టాటిల్ అభిప్రాయ పడ్డట్టుగానే ఆ చార్య చాణక్య కూడా సంఘ రాజ్యాలు చా లా సంఘటితంగానూ బలవత్తరంగానూ ఉంటాయంటాడు. విశ్వసనీయత, సాధికారికత, హేతుబద్ధత, భావోద్వేగాలు, ధైర్య సాహసాలు, శక్తిసామర్ధ్యాలు, జ్ఞానము, నై పుణ్యాలు కలిగిన రాజ్యాలు లేదా వ్యాపార సంస్థలను మాత్రమే బలమైన రాజ్యాలు లేదా సంస్థలు తమతో సంఘటితమ య్యేందుకు అనుమతిస్తాయి.. ఉత్సాహం చూపుతాయి.
అలా సంఘటితమైన రా జ్యాల సహాయ, సహకారాలు లభిస్తే.. శ త్రువులు తమను ఎదుర్కొనలేరు కాబట్టి అది మిత్రలాభం కన్నా.. ఉత్తమమనేది వా రి అభిప్రాయం. నాయకుల వ్యక్తిగత బలా లు, సంస్థల బలాలు, పరిశ్రమల బలాలు, సామాజిక, సాంస్కృతిక బలాలు ప్రజల జీవన విధానాలను చెప్పుకోదగిన విధం గా ప్రభావితం చేస్తాయి.
అలాగే ప్రతివ్యక్తీ లేదా దేశమూ తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్ర యత్నిస్తారు. సంఘాలు తమకు అనుకూలమైనప్పుడు సామదానముల చేత, ప్రతి కూలంగా ఉంటే భేదదండోపాయాల చేత వాటిని స్వాధీనం చేసుకోవాలంటాడు ఆ చార్య చాణక్య.
ప్రయోజనాల త్యాగం
ప్రపంచవ్యాప్తంగా ప్రజల విభిన్న ఆలోచనలు, అవసరాలు, పరిమితులు, వనరు లు, వికసన వారిని ప్రపంచీకరణకు అనుకూలంగా మార్చింది. ప్రపంచీకరణ నేప థ్యంలో ‘నేనే’ అంటూ గిరిగీసుకు కూర్చునే పరిస్థితి నేడు దేశానికీ లేదు. అలాగే తమ తమ రంగాల్లో పరిణతి చెందిన దేశాలేవీ మరొక దేశ ఆధిపత్యాన్ని అంగీకరించే పరిస్థితులూ లేవు. ఏ దేశానికైనా లేదా వ్యాపా ర సంస్థకైనా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.
పరిస్థితులు, సొంత ప్రయోజనాలే మైత్రిని, వైరాన్ని కలిగిస్తాయి. ఆ ర్థిక బలమే ప్రపంచాన్ని శాసిస్తుం ది. అలాగని ఏ దేశం స్వయం సమృద్ధిని సాధించలేదు.. సంఘటితమైన శక్తియే పరస్పర అవగా హన, విశ్వాసాలను కలిగిస్తుంది ఆ నేపథ్యమే వ్యాపార విస్తరణ కు, ఆర్థిక స్వావలంబనకు పు నాదిగా నిలుస్తుంది. మెట్రోరైల్‌లో.. ‘మైండ్ ది గ్యాప్’ అనే మాటను పదేపదే వింటాము.
రైలు మరియు ప్లాట్ఫారం మధ్యనుండే ప్రమాదకరమైన అంత రం పట్ల అప్రమత్తంగా ఉండాలని దాని భావం. సాధించిన విజ్ఞానం, వృత్తినైపుణ్యాలను వినియోగించుకునే క్రమంలో ఎదురవబోయే ఆపదలపై, సంక్లిష్టతలపై శ్రద్ధ వహించడానికి లేదా నివారించడానికి హెచ్చరికగా దీనిని అన్వయించుకోవచ్చు. దేశమేదైనా, సంస్థయేదైనా.. దానికి.. దాని ప్రయోజనాలే ప్రాధాన్యతాంశాలు.
తమ ప్రయోజనాలు సిద్ధింప చేసుకునేందుకై ఆలోచిస్తాయి, అవసరమైన మార్గాలను అన్వేషిస్తాయి..ఆ ఆలోచనలను అమలుచేస్తాయి. ఎదుటివారి స్వార్థపూరితమైన స్నేహ హస్తం మన ప్రయోజనాలకు ఉపకరించిన మేరకు ప్రతిస్పందించడం.. మన ప్రయోజనాలకు విఘాతంగా కనిపిస్తే దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించడం ఉత్త మం. స్వల్పకాలిక ప్రయోజనాలను త్యా గం చేసైనా దీర్ఘకాలిక ప్రయోజనాలకై అసాధారణమైన విధంగా ప్రవర్తించడం అవసరమే.
ఏదీ శాశ్వతం కాదు
ఆర్థికంగా అభ్యుదయాన్ని సాధిస్తున్న భారతదేశంపై అమెరికా వైఖరి భారత ఆర్థిక వ్యవస్థపైనే కాక రెండు దేశాల ప్ర యోజనాలకూ విఘాతం కలిగిస్తుంది. అ యితే కష్ట సమయాలు, చేదు అనుభవా లు మొదట్లో బాధాకరంగా ఉన్నా చివరగా అనుకోని దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆపద సమయంలో ఆలోచన పరిణతి చెందుతుంది. గాఢమైన పాఠాలు చేర్చుకుంటాము.
సకారాత్మక వ్యక్తిత్వ ని ర్మాణం జరుగుతుంది. అంతర్గత శక్తిసామర్ధ్యాలు జాగృతమౌతాయి. బుద్ధి వికసన జరుగుతుంది. వ్యక్తిగతంగా ఎదుగుదల కనిపిస్తుంది. విస్తృతమైన వివేచ న వెలుగుచూస్తుంది. ఇతరుల సానుభూతి లభిస్తుంది. కొత్తమార్గాలను అన్వేషించగలుగుతాం. నిజమైన స్నే హితులు ఎవరో కష్టకాలంలోనే నిర్ణయమౌతుంది. మన చేతుల్లో లేనిదా నిని.. మనం మార్చలేని దానిని అం గీకరించడం.
దానిని సరి చేసుకునే మార్గాలను అన్వేషించడం ప్రయోజనకారి. ప్రపంచంలో ఏ మార్పూ శా శ్వతం కాదు. ఏ మిత్రుడూ శాశ్వతం కాదన్న సత్యాన్ని గుర్తించాలి. అవసరాలు, పరిస్థితుల ప్రభావమే మైత్రికి లేదా శత్రుత్వానికి కారణాలు. ఆత్మవిశ్వాసం, సమర్ధత, విచక్షణా జ్ఞానం కలిగిన నాయకత్వం పిరికితనాన్ని ప్ర దర్శించదు. ప్రమాదాల అంచులపై పయనిస్తూ అవకాశాల అంబరాన్ని స్పృశిస్తుంది.
వెలుగు నీడలు పరస్పరాధారితాలు.. ప్రమాదం ఉన్నచోటే అవ కాశాలు ఉంటాయని నమ్మే ప్రభుత్వం చ ర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్ర యత్నిస్తుంది. నిరంతర జాగరూకతయే అన్ని ప్రమాదాలను అధిగమించే శక్తినిస్తుంది. ప్రభుత్వానికే కాక, ప్రతిపక్షానికీ ప్ర ముఖ పాత్రను పోషించాల్సిన బాధ్యత ఉన్నది.
బలహీనమైన ప్రధాని అంటూ ప్ర భుత్వాన్ని నిందించడం కన్నా జాతీయ భా వనతో నిర్మాణాత్మకమైన సూచనలు ఇ వ్వాలి. అవసరమైన చోట ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన నిలిచి సమస్యలనధిగమించేందుకు తామెలా సహాయ సహకారాల ను అందించగలరో చూపించాలి.
భారత్‌కే ప్రయోజనం
అమెరికా వైఖరి వల్ల భారతదేశానికి ప్రయోజనమూ కలుగుతుంది. మేధ, నైపుణ్యాలు పర దేశాలకు వలసబోవడం తగ్గు తుంది. ప్రపంచంతో పోలిస్తే అమెరికా ఒక్కటే..పెద్ద విపణి కాదన్నది యువత గుర్తిస్తుంది. అవకాశాలు అనంతంగా ఉంటా యి. ‘ఎన్నో దేశాలు భారత మేధకు ఆహ్వా నం పలుకుతున్నాయి’ అనే నిరాశ వై ఖరి నుంచి దృష్టి కోణాన్ని మార్చుకొని ఇ తర దేశాలపై దృష్టి పెట్టడం అవసరం.
గ్లా సు లో సగమే నీళ్ళున్నాయంటే.. సగం గాలి తో నిండినట్లే. ప్రభు త్వం భారతదేశంలోని వ్యాపార దిగ్గజాలతో సమావేశాలు నిర్వహించి వివిధ రంగాల్లో పెట్టుబడులు పె ట్టేందుకు ప్రోత్సహించడం, వారిని వివి ధ దేశాలకు వ్యాపార రాయబారులు గా పం పించడం ప్రయోజనకారి. ఇతర దేశాల పె ట్టుబడిదారులను, బహుళజాతి సంస్థల ను ఆహ్వానించడం వారికి అవసరమైన వ సతులను, వనరులను ఏర్పరచడం, వా రి తో సమంగా స్వదేశీ సంస్థలను ప్రోత్సహించడం వల్ల స్వదేశీ మేధను, నైపు ణ్యా లను సంపూర్ణంగా వినియోగించుకునే అ వకా శం ఉంటుంది.
వ్యాపార సంస్థలు కూ డా తమ వంతు సహకారం ప్రభుత్వాని కి అం దించాలి. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన గూగుల్ లాంటి సంస్థలకు ప్ర త్యామ్నా య సంస్థల నిర్మాణానికి సన్నద్ధం కావాలి. స్వా ర్థప్రయోజనాలను ప్రక్కన పె ట్టి సహకార స్వభావంతో కలసి నడిస్తే ఎ లాంటి గడ్డు పరిస్థితినైనా అధిగమించే సా మర్ధ్యం భారతదేశానికి ఉన్నది. అలాగే యువతర మూ డాలర్ల ఆశతో అమెరికా క లలను క నడం మానేసి తామే ఉత్తమ సం స్థలను ఆవిష్కరించేందుకు ముందుకు రావాలి. అప్పుడే ‘వికసిత భారత్’ ఆవిష్కృతం.
వ్యాసకర్త : పాలకుర్తి రామమూర్తి