calender_icon.png 8 October, 2025 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి సందేశం

02-10-2025 12:49:31 AM

గపూర్ శిక్షక్ :

అహింస ఆయుధం చేసి

సత్యమార్గమును చూపి

ధర్మ తేజో దీప్తివయ్యావు;


నడిచావు నడిపించావు

శాంతి మంత్రం పఠించావు

ఉద్యమాన్ని ఉరికించావు

శత్రువును ఎదురించావు


అహింసా మూర్తి గాంధీ

ఈ జగానికి మార్గం చూపావు

అజ్ఞానం తొలగించావు

ఏకత అందరిలో పెంచావు

సమ భావం నేర్పించావు

దశ దిశలను చూపావు;


శాంతి మూర్తిగా ఎదిగావు;

ఆలోచన నీది ఆచరణీయం;

ప్రపంచానికి గాంధే శాంతి సందేశం


రాక్షస పాలన అంతమొందించగా

ఆంగ్లేయులను తరిమివేయగా

రణ తంత్రాన్ని రచించావు


సత్యాగ్రహమును చేపట్టావు

అహింసలో బలమును తెలిపి

శాంతి లోని విలువలను తెలిపి

బలవంతులను ఓడించావు

మహాత్ముడిగా ఎదిగావు

ఓ మహాత్మా నీ శాంతి మంత్రమే కావాలిప్పుడు

నీ సమభావమే వర్ధిల్లాలిప్పుడు

నీ నామస్మరణే మోగాలిప్పుడు


నీ ధర్మ మార్గమే మెరవాలిప్పుడు

గాందేయవాదమే గెలవాలిప్పుడు

నీ సిద్ధాంతాలే నిలవాలిప్పుడు


ప్రతి గుండెలో మోగాలి

ప్రతి శ్వాసలో జీవం పోసుకోవాలి

ప్రతిచోట పరిమళమై వ్యాపించాలి

ప్రతి నోట ప్రతి ఇంట 

నీ శాంతి మాత్రమే పఠించబడాలిప్పుడు

ఈ జగానికి నువ్వే ఆదర్శం 

రక్షగా నీ సిద్ధాంతమే నిలవాలిప్పుడు