అధికారిక దత్తతతో ఇబ్బందులుండవుl

28-04-2024 12:58:50 AM

సిద్దిపేట శిశుగృహ నుంచి  పాప దత్తత

పశ్చిమబెంగాల్‌కు చెందిన దంపతులకు అప్పగింత

సిద్దిపేట, ఏప్రిల్27 (విజయక్రాంతి): అధికారికంగా పిల్లలను దత్తత తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తవని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. సిద్దిపేటలోని శిశుగృ హలో మహిళా, శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో ఉన్న 6 నెలల పాపను పశ్చిమబెంగాల్‌కు చెందిన దంపతులకు అధికారులు అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ.. పిల్లలను దంపతులు దత్తత తీసుకోవాలంటే సిద్దిపేటలోని శిశు గృహ, జిల్లా పరిరక్షణ విభాగం ద్వారా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. తద్వారా ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సావిత్రి, బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ మమత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాము, ప్రొటెక్షన్ అధికారి రాజు, శిశుగృహ మేనేజర్ ఝాన్నీ ఉన్నారు.