07-06-2025 12:54:29 AM
- నియమ నిబంధనలోఉన్న అమిస్తాపూర్‌లో అడిగేదేవరు?
- బఫర్ జోన్లో నిర్మాణం చేపట్టిన... పర్యవేక్షణ నిల్
- కాలువలు కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మాణాలు
- పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకుంటాం : అబు సిద్ధికి అన్సారీ, డీఈ, నీటిపారుదల శాఖ, మహబూబ్ నగర్
మహబూబ్‌నగర్ జూన్ 6 (విజయ క్రాంతి) : అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏదో ఒక పార్టీలో ఉం డి.. మేము రాజకీయ నాయకులం అంటూ చలామణి అవుతూ వారి ఇష్టానుసారంగా కాలువలతో పాటు అడ్డు వచ్చిన ప్రభుత్వ భూములను కబ్జాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
అభివృద్ధి తమ లక్ష్యమని... ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పుకుంటూ దర్జాగా కబ్జాలకు పాల్పడుతుండ్రు... సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షణ నిమిత్తం ఉంచినప్పటికీ.. నివారణ చర్యలు తీసుకోవడంలో మాత్రం సంబంధిత శాఖ అధికారు లు వెనకడుగు వేస్తున్రు. ప్రకృతి వైపరీత్యా లు జరిగి అధిక వర్షపాతాలు నమోదైన.. ఇ తర ఎలాంటి వరదలు వచ్చిన ఆ సమయం లో నేడు పట్టించుకోని సమస్యలు భవిష్యత్తులో ఎంతోమంది జీవితాలను అతలాకుత లం చేస్తున్నాయి.
అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఆచరించడంలో కొంతమంది కబ్జా దారులు వెనుకంజ వేస్తున్నప్పటికీ అమలు చేయించడంలో సంబంధిత అధికారులు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదని వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘట న కు కేరాఫ్ గా అమిస్తాపూర్ పిలుస్తుంది. ఈ గ్రామంలో ఉన్న వచ్చేరువు కాలవకు సం బంధించి కాలువను కబ్జా చేస్తూ దర్జాగా ఓ కంపెనీ నిర్వాహకులు భారీ ఎత్తున కాంపౌం డ్ వాల్ నిర్మాణం చేపట్టారు. అధికారులు నిత్యం అందుబాటులో ఉన్నప్పటికీ నివార ణ చర్యలు తీర్చుకోవడంలో వెనకంజ వేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
సర్కార్ చెబుతున్న సరి చేయట్లే
భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రా మంలో బుడమన్ చెరువు అలుగు, రాందా స్ చెరువు తూము మీరు కింది వైపు ఉన్న కాల్వ మీదుగా వెళ్ళవలసి ఉంది. ఈ కాల్వకు సంబంధిత మున్సిపల్ అధికారులు నిర్మా ణం చేపట్టారు. దాదాపు 6 ఫీట్ల వెడల్పులో ఈ కాలువ నిర్మాణం చేపట్టారు. ఇక్కడి వర కు బాగానే ఉన్నప్పటికీ పై చెరువుల నుంచి తూము తో పాటు అలుగు అత్యధికంగా పా రితే ఈ కాలువ నుండి పక్క ప్రాంతాలకు కూడా వర్షం నీరు భారీగా పోయే అవకాశం లేకపోలేదు.
ఇక్కడ కొంతమంది ఈ కాలువ చుట్టుపక్కల ఇండ్లు నిర్మించినప్పటికీ వారు కొంత స్థలం విడిచిపెట్టి నిర్మాణాలు చేపట్టా రు. వసంత సీడ్స్ పివిటి లిమిటెడ్ కంపెనీ నిర్వాకులు కాల్వకు ఆనుకొని భారీ ఎత్తున కాంపౌండ్ వాల్ ని ర్మాణం చేపట్టారు. ప్రజలకు పట్టిన నిబంధనలు ఈ కంపెనీకి పట్టవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ కాల్వ పక్కనే భారీ ఎత్తున గోడ నిర్మించడంతో భారీ ఎత్తున వరద వస్తే పక్కాగా ఇండ్లల్లోకి నీరు పోయే ప్రమాదం ఉంది.
ఈ విషయంపై సంబంధిత అధికారులు చెబుతున్న వివరాలను పరిగణలోకి చూస్తే ఈ కాల్వ 10 ఫీట్ల లోపు ఉందని తెలుస్తుంది. కాగా ఈ కాల్వ 10 ఫీట్ల లోపు ఉంటే కనీసం కరెండు మీటర్ల దూరంలో కాల్వకు ఇటు అటు నిర్మాణాలు చేపట్టాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. పది ఫీట్ల పైగా విస్తీర్ణంలో ఉన్న కాలువలకు 9 మీటర్ల దూరంలో ఇటు అటు వదిలే నిర్మాణాలు చేపట్టాలని అధికారుల నియమ నిబంధనలు చెబుతున్నాయి.
కాల్వకు ఆనుకొని కాంపౌండ్ వాల్ నిర్మాణం...
అమిస్తాపూర్ గ్రామంలో ఉన్న ఈ కాల్వ కు సంబంధించి ఎవరికి నచ్చినట్టు వారు ఆ కాలువకు ఆనుకొని నిర్మాణాలు చేపట్టారు. నిత్యం అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్న ఆపే దిక్కే లేరని ఆ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తుండ్రు. కాల్వకు ఆనుకొని ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వాకులు భారీ ఎత్తున కాం పౌండ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల కాలువలో పట్టలేనంత నీరు వచ్చినప్పుడు ఆ నీరంతా గ్రామంలోకి నివాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుం ది.
అధికారులు చెప్పిన మేరకు కనీసం రెం డు మీటర్లు స్థలం విడిచి నిర్మాణాలు చేపడితే భారీ ఎత్తున వర్షపు నీరు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగ కుండా ఉండే అవకాశం ఉంటుంది. కాగా ఇ క్కడ ఆ నిబంధనలో అమలు కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వకు ఇరువైపుల ఉన్న అక్రమ నిర్మాణం తొలగిం చి నియమ నిబంధనలు పాటించేలా చర్య లు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకుంటాం..
అమిస్తాపూర్ గ్రామంలో ఉన్న కాల్వకు సంబంధించి పది ఫీట్ల లోపే ఉంది. ఈ కాల్వకు ఇటు అటు రెండు మీటర్ల పొడవు నిర్మాణాలు చేపట్టకూడదు. ఎవరు చేపట్టిన ప్రత్యేక పర్యవేక్షణ చేసి నివారణ చర్యలు తీసుకుంటాం. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో చాలామంది ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. నియమ నిబంధనలు పాటించి ప్రజల ముందుకు సాగాల ని కోరుతున్నాను.
- అబు సిద్ధికి ఆజాద్ అహ్మద్ ఖాన్, ఈఈ, నీటిపారుదల శాఖ, మహబూబ్ నగర్