calender_icon.png 23 January, 2026 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను నమ్మించి నట్టేట ముంచాయి

23-01-2026 12:29:34 AM

  1. రిజర్వేషన్లపై పార్టీల వైఖరి తెలపాలి

బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్

ముషీరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): ఆ మూడు అగ్రవర్ణ పార్టీలు బీసీలను నమ్మించి నట్టేట ముంచాయని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆరోపించింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని ఫ్రంట్ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ లో ప్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్,  కో-కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టె  విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్ లతో కలసి బాలరాజ్ గౌడ్ మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 17 శాతానికి తగ్గించి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేష న్లు అమలు చేయకుండా నోటిఫికేషన్ వస్తే, మరుసటి రోజునుంచే రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేపడుతామన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను రేవంత్‌రెడ్డి సర్కార్ తుంగలో తొక్కి బీసీలను మరోసారి నయవంచన చేసిందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో ఫ్రంట్ నేతలు బైరీ శేఖర్ ముదిరాజ్, గోలిగిరి రజక, సింగం నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.