calender_icon.png 11 October, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టాలెక్కించేశారు!

09-10-2025 12:07:45 AM

వెంకటేశ్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రకటించినప్పట్నుంచే అందరిలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వెంకటేశ్ సోలోగా నటిస్తున్న సినిమా కావటం, ఆయన కథా నాయకుడిగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలకు స్క్రిప్ట్ అందించిన త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటమే ఇందుకు కారణం.

అయితే, ఈ మూవీ తాజాగా షూటింగ్ ప్రారంభించుకుంది. ఈ సందర్భంగా సెట్స్‌లో వెంకటేశ్, త్రివిక్రమ్ కలిసి దిగిన ఫొటోను నిర్మాత నాగవంశీ సోషల్‌మీడియాలో పంచుకున్నారు. “ఇరవై నెలల సుదీర్ఘ విరామం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్లీ కెమెరా వెనక్కి వచ్చారు. ప్రతి ఒక్కరి అభిమాన కథానాయకుడు వెంకటేశ్‌తో చేతులు కలిపారు. ‘ది ఓజీస్’ ఎంటర్‌టైన్‌మెంట్ మళ్లీ పునరావృతం కానుంది” అని పేర్కొన్నారు. ఇందులో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉందని, ఆ పాత్రల కోసం త్రిష, నిధి అగర్వాల్, రుక్మిణీ వసంత్ పేర్లను పరిశీలిస్తున్నారని ఇటీవల ప్రచారం బలంగా వినవస్తోంది.