calender_icon.png 29 September, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచిని చూసి పార్టీలో చేరుతుండ్రు

29-09-2025 12:50:35 AM

ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

చిన్న చింతకుంట సెప్టెంబర్ 28 : చేస్తున్న మంచి పనులను చూసి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకద్ర మండలం పసుపుల గ్రామాలకు బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన 200 మంది పార్టీల నాయకులు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం 6 గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరుతున్నట్లు నూతనంగా చేరిన నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దేవరకద్ర మాజీ ఎంపిటిసి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమ్మిగారి వెంకటేష్ బలుసు పల్లి మాజీ సర్పంచ్ శంకర్ దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన దేవరకద్ర మాజీ ఎంపిటిసి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ ,

బలుసు పల్లి మాజీ సర్పంచ్ శంకర్ , బలుసు పల్లి మాజీ ఉపసర్పంచ్ తిరుపతయ్య , మాజీ వార్డ్ మెంబర్ లు బాలరాజు, జి. ఆంజనేయులు, సోల ఆంజనేయులు, శాలి వీరాంజనేయులు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.