calender_icon.png 29 September, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డి82 కాలువకు మళ్ళీ గండి..!

29-09-2025 12:52:13 AM

హుటాహుటిన మరమ్మతు పనులు 

వెల్దండ సెప్టెంబర్ 28 : వెల్దండ మండల పరిధిలోని పోతేపల్లి రెవెన్యూ శివార్లోని డి 82కాలు వ 22 కిలోమీటరు వద్ద శనివారం రాత్రి గండిపడి నీరు వృధాగా పంట పొలాల వెంట పారింది. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువ దెబ్బతిన్నాయా, ఇతరులెవరైనా కాల్వ తెంపి ఉంటారా అన్న కోణంలో అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రతి ఏటా వర్షాలు అధికంగా కురిసిన ఎగువ నుంచి నీరు అధికంగా వచ్చిన కాల్వ గండిపడి ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంటలు, పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత మూడు నెలల్లోనే రెండుసార్లు చేయాలి కాల్వకు గండిపడి పంట పొలాలను నాశనం చేస్తుంది. అది మరవక ముందే తరచూ కాలువకు గండ్లు పడడానికి పనులు నాణ్యతగా చేయకపోవడమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. కాలువకు గడ్డిబడిన విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ అధికారులు డిఈఈ దేవన్న, నరేందర్ రెడ్డి, ఏఈలు ప్రభాకర్, మాల్యాలు అధికారులు హుటాహుటిన మరమ్మతులు చేపట్టి నేటి వృధాను అరికట్టి దిగువకునీరువదిలారు.