13-01-2026 02:05:03 AM
ట్రేడింగ్ పేరిట రూ.27 లక్షలు స్వాహా
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (విజయక్రాంతి): తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మి మరో విద్యా వంతుడు మోసపోయాడు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఆసిఫ్‌నగర్‌కు చెంది న ఓ వ్యక్తి నుంచి విడతల వారీగా ఏకంగా రూ.27 లక్షలు కాజేశారు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన 38 ఏళ్ల బాధితుడు ఫేస్‌బుక్‌లో వచ్చిన యాడ్‌ను క్లిక్ చేయగా, సైబర్ నేరగాళ్లు అతన్ని ఒక వాట్సాప్ గ్రూపులో యాడ్ చేశారు. ఆ గ్రూపులోని అడ్మిన్లు నకిలీ లాభా ల స్క్రీన్ షాట్లు పెడుతూ, తమ సలహాలతో భారీ లాభాలు గడించవచ్చని నమ్మించారు. వారి మాటలు నమ్మి, వారు సూచించిన అడ్వంప అనే ట్రేడిం గ్ యాప్‌ను బాధితుడు డౌన్లోడ్ చేసుకున్నా డు.
మొదట చిన్న మొత్తంగా రూ.10 వేలు పెట్టుబడి పెట్టించారు. యాప్‌లో లాభం వచ్చినట్లు చూపిం చడంతో బాధితుడికి న మ్మకం కుదిరింది. ఇదే అదనుగా భావించిన కేటుగాళ్లు అతడితో విడతల వారీగా మొత్తం రూ.27,05,000 పెట్టుబడి పెట్టించారు. ఆ నకిలీ యాప్‌లో బాధితుడి ఖాతాలో అసలు, లాభాలతో కలిపి రూ.81,69,600 ఉన్నట్లు చూపించారు. ఆ డబ్బును చూసి సంబరపడ్డ బాధితుడు.. విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా కుదరలేదు. ఎందుకు డ్రా కావడం లేదని అడగ్గా.. ఆ మొత్తం రావాలంటే ‘ప్రాసెసింగ్ ఫీజు, పన్నుల’ పేరుతో రూ.50 లక్షలు కట్టాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.