13-01-2026 02:04:36 AM
వెంకటాపూర్, జనవరి12,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163 జయంతి ఉత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. వివేకనంద స్వామి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రుద్రోజు బ్రహ్మచారి మాట్లాడుతూ.. స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వామి వివేకానంద నరుడే నారాయణుడని మానవసేవే మాధవ సేవయని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు.
యువశక్తి అనునది అను శక్తి కంటే బలమైనదని యువజన చైతన్యమే లక్ష్యంగా యువత యొక్క భాగస్వామ్యాన్ని దేశ అభివృద్ధికి బాటలు వేసేలా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహానుభావుడని, నేటి యువత అతని సూక్తులను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ గుర్తించేలా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, బానోత్ యోగి, కాంతాల ప్రేమేందర్ రెడ్డి, మెట్టు రజినికర్, మెంతుల వంశీ, బైకని రాకేష్, ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు బానోత్ రవీందర్, వార్డు సభ్యులు బానోత్ సునీల్, నల్ల కోటి తదితరులు పాల్గొన్నారు.
చైతన్యం నింపిన మహనీయులు
వెంకటాపూర్, జనవరి12,(విజయక్రాంతి): మండలంలోని నల్లగుంట గ్రామంలో భాజపా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ భూక్య జవహర్ లాల్ హాజరై మాట్లాడుతూ.. ప్రపంచానికి భారతదేశ ఆధ్యాత్మిక విలువలను చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని, ఆయన బోధనలు, ప్రసంగాలు యువతలో చైతన్యం నింపుతూ ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని, స్వామి వివేకానంద జయంతి రోజైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం 1984లో నిర్ణయించిందని, 1985 నుంచి ఏటా యువజన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని, భారతదేశ ఖ్యాతిని, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, శ్రీధర్, రవి, రమేష్, కృపన్వేష్, సమ్మయ్య, లత, కావ్య, సారక్క పాల్గొన్నారు.