10-01-2026 02:12:08 AM
రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయికా ద్వయం డింపుల్, ఆషిక శుక్రవారం విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆషిక మాట్లాడుతూ.. “డైరెక్టర్ కిషోర్ తిరుమలతో ముందు ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం.
కొన్ని కారణాల వల్ల ఇది కుదరలేదు. తర్వాత ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ చెప్పారు. అప్పడే ఇందులో మోడ్రన్ గర్ల్ పాత్ర చేయాలనుకున్నా. ఆయన కూడా అదే పాత్రకు అనుకున్నానని చెప్పారు. ‘నా సామిరంగ’తో పోల్చుకుంటే ఇది పూర్తిగా విభిన్నమైన పాత్ర. ఖచ్చితంగా నా కెరీర్‌లో చాలా కొత్తగా వుంటుంది. నా పాత్ర పేరు మానస శెట్టి. ఇప్పుడున్న అమ్మాయిలు రిలేట్ అయ్యే క్యారెక్టర్. -రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం.
సునీల్, వెన్నెల కిషోర్, సత్యల టైమింగ్ మ్యాచ్ చేయడం కూడా ఛాలెంజ్‌గా అనిపించింది. -కమర్షియల్ సినిమాల్లో హీరోల పాత్రల్లో ఎలాంటి తప్పులు కనిపించవు. ఇప్పుడు కథల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రతి క్యారెక్టర్‌లో ఏదో ఒక తప్పు, లేదా లోపం ఉంటోంది. అలాంటి పాత్రలను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడున్న రిలేషన్‌షిప్స్‌లో చాలా కాన్‌ఫ్లిక్ట్స్ వున్నాయి.
ఆ అంశాలను దర్శకుడు అందరూ రిలేట్ అయ్యేలా హ్యాండిల్ చేశారు. -నా ప్రతి సినిమా విభిన్నంగా వుండాలనుకుంటా. -ప్రస్తుతం విశ్వంభర, సర్దార్2 చిత్రాలు చేస్తున్నా. ‘అది నా పిల్లరా’ అనే మరో సినిమా చేస్తున్నా” అని తెలిపింది. డింపుల్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ కిషోర్ -కథ చెప్పిన తర్వాత ఇందులో హీరో రవితేజ అని చెప్పడం ఇంకా ఆనందాన్నిచ్చింది. రవితేజతో ఇది నా రెండో సినిమా.
ఆయన వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది. ఈ కథ వినగానే ఇందులో వైఫ్ క్యారెక్టర్ చేయాలనుకున్నా. ఎందుకంటే అప్పటికే రవితేజ సినిమాలో ఒక మోడరన్ అమ్మాయి పాత్ర చేశా. డైరెక్టర్ కూడా బాలామణి పాత్ర కోసమే అనుకోవడం ఆనందంగా అనిపించింది. -ఇందులో నాది చాలా స్వతంత్రంగా ఉండే బలమైన పాత్ర. ఈ సినిమాలో ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ వుంది. కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. కామెడీ చాలా సెన్సిబుల్‌గా వుంటుంది. -ఈ మూవీ జర్నీలో నేను, ఆషిక మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మా మధ్య మంచి అనుబంధం వుంది” అని చెప్పింది.