calender_icon.png 10 January, 2026 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు భిన్న కోణాల మా ఇంటి బంగారం

10-01-2026 02:10:39 AM

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందినీరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాన్క్ దువ్వూరు నిర్మిస్తున్నారు. కథనం, స్క్రీన్‌ప్లే, డైలాగులను వసంత్ మారిన్గంటి, రాజ్ నిడిమోరు రచించగా, ప్రముఖ రచయిత సీతా ఆర్ మీనన్ క్రియేటివ్ సూపర్‌విజన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తుండగా గౌతమి, మంజుషా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ శుక్రవారం విడుదలైంది. ఈ టీజర్ ట్రైలర్‌ను గమనిస్తే.. కామెడీతో నవ్వించే సినిమా ఉన్నట్లుండి రియలిస్టిక్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్‌గా జరిగే మార్పును స్పష్టంగా గమనించవచ్చు. ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా మెప్పించనుందని, సమంతను సరికొత్త పాత్రలో ఆవిష్కరించనుందని తెలుస్తోంది.

టీజర్‌లో సమంతను తొలుత సాధారణ గృహిణి పాత్రలో చూపించారు. తన అత్తగారింటికి వెళ్లిన తర్వాత పరిస్థితులు తలకిందులు కావడం.. నవ్వుతూ మృదు స్వభావిగా కనిపించే ఆమె ఉన్నట్లుండి ఎదురుదాడి చేసేంత శక్తిమంతురాలిగా మారడం వంటి సన్నివేశాల్లో సమంత పాత్ర రెండు భిన్న కోణాల్లో ఆకట్టుకోనుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి ఓంప్రకాశ్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.