30-08-2024 12:00:00 AM
యువ కథానాయకుడు రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన చిత్రం ‘వీక్షణం’. మనోజ్ పల్లేటి దర్శకత్వంలో పి.పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ‘ఎన్నెన్నో..’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేయసి ప్రేమలో మునిగిన ప్రేమికుడి మనసు ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్తోందీ పాట. సమర్థ్ గొల్లపూడి సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రంలోని ఈ పాటను రెహ్మాన్ రాయగా, సిద్ శ్రీరామ్ ఆలపించారు. సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.