23-03-2025 12:00:00 AM
ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం సందర్భంగా అనుకోకుండా బయటపడిన సుమారు యాభై కోట్ల రూపాయలపై సర్వాత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. ఈ సంఘటన ప్రజలలో న్యాయ వ్యవస్థపై కలవరానికి తావిచ్చింది. దేశంలో ఎవరికి ఏ రకమైన అన్యాయం జరిగినా మొదట తలుపు తట్టేది న్యాయస్థానాన్నే.
రాజ్యాంగ నిర్మాతలు కూడా ఈ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించి, ఏ రకమైన ఆర్థిక సామాజిక రాజకీయ మలినాలు, ప్రొద్బలం దరి చేరకుండా ఉండటానికి కృషి చేశారు. అయితే, కాలక్రమేణా 70వ దశకం నుంచి స్వతంత్ర భారత న్యాయవ్యవస్థపై రాజకీయ ఆర్థిక తదితర ప్రభావాలు పొడచూపుతూ, ఇటీవలి కాలంలో తారాస్థాయికి చేరడం దురదృష్టకరం.
ఈ ధోరణి ఏ మాత్రం శ్రేయోష్కరం కాదు. ముఖ్యంగా మనలాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సామాన్య ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం కలిగి ఉండటానికి ఇదే మూలాధారం. మన రాజ్యాంగ నిర్మాతలు, దార్శనికులు ఆశించిన స్థాయిలో న్యాయ వ్యవస్థ కొనసాగాలని అందరూ ఆశిస్తున్నారు.
కారణాలు ఏవైనా అవినీతి, వివిధ రకాల ప్రలోభాలకు గురవుతున్న న్యాయమూర్తులపై కొలీజియం తగు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజా విశ్వాసాన్ని పెంపొందింపజేయాలి.
రావుశ్రీ, హైదరాబాద్