23-03-2025 12:00:00 AM
రికార్డు స్థాయిలో అంతరిక్షంలో పనిచేసి భూమికి తిరిగి వచ్చిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు యావత్ ప్రపంచం అభినందనలు తెలుపుకుంటున్నది. తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన తర్వాత సందిగ్ధ స్థితిలో విజయవంతంగా ఆమె పునరాగమనం చేయడం ఆనందదాయకం. ఆమెలోని సహనం, నైపుణ్యం, పట్టుదలకు ఈ యాత్ర నిదర్శనం.
అంతరిక్ష యానాలలో ఎదురయ్యే అనుకోని ప్రమాదాలనేకాక వ్యోమగాముల శిక్షణ, సమస్యల పరిష్కారాలు, ఇతరేతర నైపుణ్యాల ప్రాధాన్యాన్ని ఈ మిషన్ స్పష్టంగా చాటి చెప్పింది. ముఖ్యంగా సునీత భూమికి క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా తిరిగి రావడం భారతీయులందరికీ గర్వకారణమేకాక కొంగ్రొత్త ఉత్సాహాన్ని కలిగించింది. ప్రపంచ వ్యోమగాములు, శాస్త్రవేత్తలకు ఇదొక గొప్ప ప్రేరణ.
డా.కృష్ణకుమార్ వేపకొమ్మ, రాజీవ్‌నగర్