11-08-2024 06:44:04 AM
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): సుంకిశాల ప్రమాదం వెనుక బాధ్యులను వెంటనే రాష్ట్రప్రభుత్వం గుర్తించాలని, ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఏం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. లోపభూయిష్ఠంగా ప్రాజెక్ట్ పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం ఎందుకు సంశయిస్తుందో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. ఈ వ్యవహారంలో సక్రమంగా విచారణ జరిగేలా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సి ఉందన్నారు. కానీ సర్కార్ వెనకంజ వేస్తున్నదని మండిపడ్డారు. సుంకిశాల ప్రమాదాన్ని కప్పిపుచ్చేందుకు సర్కార్ ఎందుకు యత్నిస్తున్నదో బయటకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.