15-09-2025 01:41:17 AM
-కాకతీయ వర్సిటీ గేట్ వద్ద విద్యార్థుల ఆందోళన
-తమకు న్యాయం చేయాలని డిమాండ్
హనుమకొండ, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థులు గజానంద్, పవన్‌లపై దాడికి పాల్పడిన బయట వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ ఆదివారం రాత్రి వర్సిటీ విద్యా ర్థులు మొదటి గేట్ వద్ద ఆందోళనకు దిగారు. కాకతీయ వర్సిటీలోనే చదవు పూర్తయిన కొందరు విద్యార్థి సంఘాల ముసుగులో వర్సిటీలో ఆధిపత్యం చలాయిస్తున్నారని, వెంటనే వారిని గుర్తించి బయటకు పంపించాలని డిమాండ్ చేశారు.
ఏబీవీపీ సంఘం పేరుతో కొందరు చదువు తమ చదువు పూర్తయినా, వర్సిటీలోనే ఉంటూ తమ చదువులకు ఆటంకం కలిగిస్తున్నారని మండిప డ్డారు. శనివారం రాత్రి జరిగిన ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. న్యాయం జరిగేవరకు ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నాన్ బోర్డర్లను యూనివర్సిటీలోకి రాత్రిపూట రానీవ్వకూడదని నినాదాలు చేశారు.
అర్ధరాత్రి గొడవ..
కొందరు బయటి వ్యక్తులు తాగిన మైకంలో కాకతీయ వర్సిటీలోకి వచ్చి విద్యార్తిపై చేసుకోగా, బయటి వ్యక్తులకు, వర్సిటీ విద్యార్థుల మధ్య శనివారం అర్ధరాత్రి గొడవ రాజుకుంది. యూనివర్సిటీ సీఐ రవికుమార్ పోలీస్ సిబ్బందితో వ చ్చి ఇరు వర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించారు. గొడువకు కారణమైన వ్యక్తులను అదుపులోకి తీసుకొని జీప్‌లో తరలించేందుకు ప్రయత్నిం చగా.. విద్యార్థులు పోలీసుల జీపును అడ్డుకున్నారు. బయటి వ్యక్తులు వర్సిటీ లోపలికి వచ్చి దాడులు చేయడం తగదని, తమకు న్యాయం చేసే వరకు పోలీసు వాహనాలను బయటకు పంపమంటూ భీష్మించుకొని కూర్చున్నారు.