25-08-2025 01:54:13 AM
బీఆర్‌ఎస్ నాయకుల ఆరోపణ
మంచిర్యాల, ఆగస్టు 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇంటి పేరిట పేదవారి నుంచి ఇంటికి రూ.50 వేలు వసూలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ రాష్ర్ట నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆరోపించారు. ఆదివారం మంచిర్యాల పట్టణం లోని రాజీవ్‌నగర్‌లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లను కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు, కార్యకర్తలకు, వారి బంధువులకు మాత్రమే మంజూరు చేశారని మండిపడ్డారు.
అరులైన లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు జిల్లా కేంద్రంలో 330 డబుల్ బెడ్ రూం గృహాలను నిర్మించారని, అధికారుల, మీడియా సమక్షంలో పేదవారికి లాటరీ పద్ధతి ద్వారా ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగింద న్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభు త్వం మారడంతో పేదవారికి మంజూరైన ఇండ్లను వారికి కేటాయించకుండా ఇబ్బంది పెడుతుండ్రని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కావాలనే కాలయాపన చేస్తూ, మం జూరైన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయిస్తే మాజీ ఎంఎల్‌ఏ దివాకర్ రావుకి పేరు వస్తుందన్న అసూయతో, రాజకీయ కక్షతో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇవ్వడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని కోరారు. లేదంటే లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు