వెయ్యి మంది ఉద్యోగులకు ఉద్వాసన
- విధుల్లోకి 50 రోబోలు
- జనరల్ మోటార్స్ (జీఎం) నిర్ణయం
వాషింగ్టన్, జూన్ 22: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వచ్చిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏ చిన్న పని అయిన ఈజీగా పూర్తి చేసే రోబోలు రావడంతో కంపెనీలు భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. అమెరికాకు చెందిన ప్ర ముఖ ఆటో మొబైల్ సెక్టార్ కంపెనీ జనరల్ మోటార్స్(జీఎం) 50 రోబోలను పనిలో పెట్టుకునేందుకు ఏకంగా వెయ్యి మంది సిబ్బందిని తొలగించడం ఇప్పుడు తీవ్ర దు మారం రేపుతోంది.
కంపెనీ తీసుకున్న నిర్ణయంపై కార్మిక సంఘాలు సైతం మండి పడుతున్నాయి. మిషిగన్‌లోని తన కేంద్ర కార్యాలయంలో కొలాబరేటివ్ రోబోట్స్ (కోబోట్స్)ను జనరల్ మోటార్స్ లిమిటెడ్ పెట్టుకుంది. వాహనాల అసెంబ్లింగ్ లో మిగ తా ఉద్యోగులతో కలిసి కోబోట్స్ పని చేస్తున్నాయి. తమ కార్యకలపాల్లోకి అత్యాధునిక టెక్నాలజీని చొప్పించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ రోబోలను తీసుకువచ్చినట్లు కంపె నీ ప్రతినిధి కెవిన్ కెల్లీ వెల్లడించారు.
అన్ని భద్రతా రూల్స్ పాటిస్తూనే, తమ ఉత్పత్తులు పోటీని తట్టుకునేలా చూసుకునేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.అయితే జనరల్ మోటార్స్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మెషిన్లు తమ ఉద్యోగా లను లాగేసుకుంటున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెయ్యి ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు వారి స్థా నంలో రోబోలు వచ్చాయి. ఇదే భవిష్యత్తు అని చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే ప్రజలకు ఉద్యోగాలు ఉండవు’ అని యూనియన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.






